Telangana

News March 25, 2024

HYD: ఆ రోజు సెలవు.. జీతం కూడా..!

image

MP ఎన్నికలు, కంటోన్మెంట్ ఉపఎన్నిక సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మే 13(సోమవారం)న వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించిందని మేడ్చల్ జిల్లా అధికారులు గుర్తు చేశారు. సోమవారం నాచారంలో కార్మిక ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, సముదాయాల చట్టాల కింద సెలవు ఇచ్చారన్నారు. భవిష్యత్తు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు.

News March 25, 2024

NLG: రాచకొండ పై రేకెత్తుతున్న ఆశలు!

image

ఘనమైన చరిత్ర కలిగి, రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న రాచకొండ ప్రాంత అభివృద్ధికి అడుగులు పడడం లేదు. ఫిలిం సిటీ, స్పోర్ట్స్ సిటీ, నెమళ్ల పార్కు, రోప్వే వంటివి ఏర్పాటు చేసి రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తామని నాటి ప్రభుత్వం హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. రాచకొండను HYD, SEC, సైబరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఇటీవల CM రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి.

News March 25, 2024

గద్వాల జిల్లాకు పొంచి ఉన్న తాగునీటి గండం

image

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతుండటంతో జోగుళాంబ గద్వాల జిల్లాకు తాగునీటి గండం పొంచి ఉందని చెప్పొచ్చు. ఈ ఏడాది కృష్ణాబేసిన్‌లో వర్షాలు తక్కువగా కురవడంతో ప్రాజెక్టులలో తగినన్ని నీటి నిల్వలు లేవు. దీంతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా.. రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినప్పటికీ రోజు రోజుకు మండుతున్న ఎండలకు జూరాలలోని నీటి నిల్వలు పడిపోతుండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

News March 25, 2024

HYD: హోలీ రోజు దారుణం.. BRS నేతపై కత్తితో దాడి..!

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. BRS వికారాబాద్ మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో గాయపడిన ఆయణ్ని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పొందుతున్న కమలాకర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు.

News March 25, 2024

RR: హోలీ రోజు దారుణం.. BRS నేతపై కత్తితో దాడి..!

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. BRS వికారాబాద్ మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో గాయపడిన ఆయణ్ని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పొందుతున్న కమలాకర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు.

News March 25, 2024

భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలు ప్రారంభం

image

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో హోలీ పౌర్ణమి సందర్భంగా డోలోత్సవం, వసంతోత్సవo వైభవంగా నిర్వహించారు. స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించిన రోజు భద్రాద్రి రామయ్యను పెళ్లికుమారుడిని చేసినట్లు విశ్వసిస్తారు. అలాగే మిథిలా స్టేడియంలో రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు కలిపారు. ఈ వేడుకకు అశేష భక్త జనం హాజరయ్యారు.

News March 25, 2024

కరీంనగర్: మత్తుకు బానిస!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఉన్నత చదువులు చదివి కన్నవారి కలలు నెరవేర్చాల్సిన పిల్లలు వ్యసనాలకు బానిసై బంగారు భవితను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులూ తమ పిల్లలను గమనించి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. జగిత్యాలలో బాలికలకు ఓ ముఠా మత్తు మందు ఇచ్చి రేవ్‌ పార్టీలకు తీసుకెళ్తోందనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

News March 25, 2024

నిజామాబాద్: పడిపోయిన పసుపు ధరలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అల్‌టైం రికార్డు ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.18,299 పలికిన పసుపు రూ.1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో పసుప ధర గరిష్ఠంగా క్వింటాలుకు రూ.16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు రెండు రోజులు మాత్రమే పసుపు కొనుగోళ్లు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు.

News March 25, 2024

పండగపూట తీవ్ర విషాదం.. వార్ధా నదిలో నలుగురు గల్లంతు

image

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధ నదిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు నదీమాబాదుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుల కోసం రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

News March 25, 2024

MBNR: గొర్రెల పంపిణీ.. పాత అధికారుల పాత్రపై ఆరా

image

ఉమ్మడి జిల్లాలో 2017 సంవత్సరంలో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేసింది. NGKL జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారిగా ఉన్న అంజిలప్ప, ఏడీ కేశవసాయి ఏసీబీ అధికారులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. వీరు ఉమ్మడి జిల్లాలో 4 సంవత్సరాల పాటు పనిచేశారు. వీరి హయాంలో జరిగిన గొర్రెల యూనిట్ల పంపిణీ ఏమైనా అవినీతి జరిగిందా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రికార్డులను తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.