Telangana

News July 19, 2024

నల్గొండ: కూల్ డ్రింక్ ఇచ్చి.. మహిళ మెడలో బంగారం చోరీ

image

మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన పీఏ పల్లి మండల పరిధిలోని మల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గన్నేబోయిన ముత్యాలమ్మ గ్రామ శివారులో పంట పొలంలో పనిచేస్తుంది. అక్కడికి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిలా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. డ్రింక్ తాగుతుండగా రాయితో ఆమె తలపై కొట్టి బంగారం లాక్కెళ్లినట్లు SI నర్సింహులు తెలిపారు.

News July 19, 2024

నిజామాబాద్: లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

image

నగరంలోని లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లాడ్జీలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా వాటిని నిరోధించడానికి ఈ తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, టౌన్ సీఐ నరహరి, మహిళా సీఐ శ్రీలత, నాలుగవటౌన్ ఎస్ఐ పాండేరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

News July 19, 2024

KTDM: వాగులో చేపలకు వెళ్లి మరో వ్యక్తి గల్లంతు

image

 పోలవరం సమీపంలో ఉన్న పాల కాలువలో శుక్రవారం గిరిజనుడు గల్లంతయ్యాడు. వెలమలకోటకి చెందిన వెంకన్న దోర (40) చేపలు పడుతుండగా వాగులో ఒక్కసారిగా వరద ఉద్ధృతికి పెరగడంతో కొట్టుకు పోయాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

News July 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటుకు మంత్రి పొన్నం హామీ.
@ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.
@ ధర్మారం మండలంలో తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య.
@ కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ సహా ఆరుగురు కౌన్సిలర్లు.
@ రాయికల్ మండలంలో ఇద్దరు పేకాటరాయుళ్ల పట్టివేత.

News July 19, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. దీంతో రైతులు గమనించి వ్యవసాయ మార్కెట్ కు సరుకులు తీసుకొని రావద్దని మార్కెట్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సోమవారం యథావిధిగా మార్కెట్ ఓపెన్ అవుతుందని తెలిపారు.

News July 19, 2024

ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు

image

గార్ల మండలంలోని పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లెవెల్ బ్రిడ్జి నుంచి వరద ప్రభావం ఎక్కువ ఉండటంతో రాంపురం, మద్దివంచ మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు వాగు సమీపంలోకి ఎవరూ రాకూడదని అధికారులు సూచించారు.

News July 19, 2024

తల్లిని హత్య చేసిన కొడుకు రిమాండ్

image

కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని ఇటీవల తల్లి సక్రిని కర్రతో కొట్టి హత్య చేసిన కుమారుడు భీముడు ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. ఈనెల 15న కన్నతల్లి అయిన సక్రిని గుగులోత్ భీముడు కర్రతో కొట్టి హత్య చేశాడు. విచారణలో తల్లిని చంపిన వ్యక్తి బీముడు ను అదుపులో తీసుకొని రిమాండ్ చేసినట్లు ఎస్ఐ చెప్పారు.

News July 19, 2024

ALP: పూజ సామాగ్రి సరఫరాకు సీల్డ్ టెండర్లు

image

అలంపూర్ ఆలయాలకు పూజ, కిరాణా తదితర సామాగ్రి ఏడాది పాటు సరఫరా చేసేందుకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో సీల్డ్ టెండర్లు జరిగాయి. ఇందులో వివిధ ప్రాంతాల ఏజెన్సీలు పాల్గొని టెండర్లు దక్కించుకున్నాయి. కరపత్రాల ప్రింటింగ్, లడ్డు, పులిహోర కవర్లు, క్యారీ బ్యాగులు ప్రైవేట్ సెక్యూరిటీకి టెండర్లు నిర్వహించగా MBNR, HYD ప్రాంతాల ఏజెన్సీలు దక్కించుకున్నాయని మహబూబ్ నగర్ దేవాదాయశాఖ సహాయ కమీషనర్ శ్రీనివాసరాజు తెలిపారు.

News July 19, 2024

ADB: పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంను ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుళ్లకు వడ్డించే ఆహారాన్ని స్వయంగా తిని పరిశీలించి వంటలు నిర్వహించే వారికి సూచనలు చేశారు. ఆహారాన్ని నాణ్యతతో కూడిన వస్తువులతో వండాలని సూచించారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు శిక్షణ కాలంలో క్రమం తప్పకుండ హాజరవ్వాలని అన్నారు.

News July 19, 2024

మునగాల: విధుల పట్ల నిర్లక్ష్యం తగదు : కలెక్టర్‌

image

మునగాల పి.హెచ్. సి. ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేసారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మునగాల పి.హెచ్.సి.కి వెళ్లగా ఆ సమయానికి మెడికల్ అఫీసర్, సిబ్బంది లేకపోవటం వల్ల కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ని, మెడికల్ స్టోర్‌ని పరిశీలించారు. అలాగే పి.హెచ్.సి.ని పరిశీలించగా పరిశుభ్రంగా లేకపోవటం పట్ల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.