Telangana

News May 15, 2024

పాలమూరు బిడ్డకు BRICS యువజన సదస్సు ఆహ్వానం

image

ఈనెల 15, 16న సౌత్ ఆఫ్రికాలోని ట్రిటోరియాలో జరిగే BRICS యూత్ ఇన్నోవేషన్ సమావేశాలకు భారత్ నుంచి మరికల్ మండల కేంద్రానికి చెందిన న్యాయవాది అయ్యప్పకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, స్థిరమైన, సమ్మిళిత వృద్ధిపై బ్రిక్స్ దేశాలు చర్చిస్తాయి. బ్రిక్స్ యూత్ ఇన్నోవేషన్ సదస్సుకు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు న్యాయవాది అయ్యప్ప అన్నారు.

News May 15, 2024

కోస్గి: విమానం ఎక్కేలోగా మృత్యువడిలోకి..

image

కాసేపట్లో విమానం ఎక్కాల్సిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందారు. కోస్గికి చెందిన పలువురు వ్యాపారులు కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా కాసేపట్లో విమానం ఎక్కాల్సి ఉంది. వారిలో ఒక్కరైన కూర వెంకటయ్య(75) అప్పటివరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. వెంకటయ్య తోటి బృందం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో కోస్గిలో విషాదం నెలకొంది.

News May 15, 2024

కరీంనగర్: 2,686 మందికి డబ్బులు వాపస్!

image

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. KNR జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే DDలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వనున్నారు. రెండో విడతలో యూనిట్‌ ధర రూ.1.75 లక్షలుగా ఉండటంతో లబ్ధిదారుల వాటాగా రూ.43,750 చెల్లించారు. ఈ విడతలో 3,404 యూనిట్ల కోసం DDలు చెల్లించగా 718 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 2,686 మందికి డీడీల సొమ్ము తిరిగి చెల్లించనున్నారు.

News May 15, 2024

వరంగల్: 2007 నుంచి BRSదే గెలుపు!

image

NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.

News May 15, 2024

MBNR: కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

మహబూబ్ నగర్‌లోని ఏనుగొండ సమీపంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ వై.సురేందర్ తెలిపారు. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈలో 10 తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఎంపీసీ, బైపీసీలో కలిపి 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని, ఈనెల 15 నుంచి కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 15, 2024

ఖమ్మం స్థానంలో ఎవరి అంచనాలు వారివే!

image

ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తమ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారని దేశంలోనే అధిక మెజార్టీ వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

News May 15, 2024

నల్గొండ స్థానంలో ఎవరి అంచనాలు వారివే!

image

నల్గొండ లోక్ సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. తమకు అనుకూలమైన ఓటు పడిందని, తమ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, దేశంలోనే అధిక మెజార్టీ వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

News May 15, 2024

నిజామాబాద్: గుండెపోటుతో వ్యవసాయ అధికారి మృతి

image

నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ (40) బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన మృతి పట్ల అధికారులు, రైతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీపీ సారిక, ఎంపీడీవో బాలకృష్ణ, ఎమ్మార్వో మాలతి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

News May 15, 2024

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్ ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్‌గా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బుధవారం రిమ్స్‌లోనే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సిబ్బంది స్పందించి ఎంఐసీయూ వార్డ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సూపర్‌వైజర్‌ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 15, 2024

నాగర్‌కర్నూల్ MP ఎన్నికలు.. పోలింగ్ ఇలా..!

image

నాగర్‌కర్నూల్ లోక్ సభ పరిధిలో మొత్తం 69.46 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 17,38,254 ఓట్లకు గానూ 12,07,471 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 6,13,085 మంది పురుషులు, 5,94,967 మంది స్త్రీలు, 19 మంది ఇతరులు ఉన్నారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్‌లో అత్యధికంగా 74.93, 74.06 శాతం పోలింగ్ కాగా.. అచ్చంపేట, కొల్లాపూర్‌లో అత్యల్పంగా 65.11 శాతం చొప్పున నమోదైంది. పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది.