Telangana

News May 15, 2024

ఉపఎన్నికపై నేడు KTR సన్నాహక సమావేశం

image

MLC పట్టభద్రుల ఉపఎన్నికపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల MLC స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డిని BRS బరిలో దింపింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఉపఎన్నికలో పార్టీ కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించి నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

News May 15, 2024

హైదరాబాద్‌లో ఫలించిన కృషి

image

ఓటు విలువను తెలియజేస్తూ చేపట్టిన SVEEP కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 2019 MP ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 3.26 శాతం ఓట్ల శాతం పెరిగినట్లు వెల్లడించారు.
హైదరాబాద్: 2019-44.75%, 2024-48.48% నమోదు.
సికింద్రాబాద్:2019-46.26%, 2024-49.04% నమోదు.
మల్కాజిగిరి:2019-49.63%, 2024- 50.78% నమోదు.
చేవెళ్ల: 2019-53.25% 2024-56.50% నమోదైంది.

News May 15, 2024

శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల ఆదాయం కన్నా ఖర్చు అధికం

image

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల లెక్కలను అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు రూ. 2,37,30,121 ఖర్చు చేయగా, అన్ని మార్గాల ద్వారా రూ.1,89,61,124 ఆదాయం సమకూరింది. సెక్టార్ల ద్వారా సుమారు రూ.93 లక్షలు, పరోక్ష సేవల ద్వారా రూ.7 లక్షలు, పోస్టల్ ద్వారా అంతరాలయ సేవలకు రూ.90 వేలు వచ్చాయి.

News May 15, 2024

హైదరాబాద్‌లో ఫలించిన కృషి

image

ఓటు విలువను తెలియజేస్తూ చేపట్టిన SVEEP కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 2019 MP ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 3.26 శాతం ఓట్ల శాతం పెరిగినట్లు వెల్లడించారు.
హైదరాబాద్: 2019-44.75%, 2024-48.48% నమోదు.
సికింద్రాబాద్:2019-46.26%, 2024-49.04% నమోదు.
మల్కాజిగిరి:2019-49.63%, 2024- 50.78% నమోదు.
చేవెళ్ల: 2019-53.25% 2024-56.50% నమోదైంది.

News May 15, 2024

మంచిర్యాల: హాజీపూర్‌లో ఒకరి దారుణ హత్య

image

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఈ మేరకు హాజీపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

News May 15, 2024

కొల్లాపూర్: 807 అడుగుల మేర శ్రీశైలం తిరుగుజలాలు

image

కొల్లాపూర్ మండలం ఎల్లూరు రేగుమాన్గడ్డ తీరంలో మంగళవారం నాటికి 807 అడుగుల మేర శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ ఉన్నట్లు మిషన్ భగీరథ పథకం ఈఈ సుధాకర్ సింగ్ చెప్పారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ ద్వారా రేగుమాన్ గడ్డ తీరంలో నిల్వ ఉన్న శ్రీశైలం తిరుగుజలాలను పంపులతో ఎత్తిపోస్తున్నారన్నారు. తాగునీరు అందించే ఎల్లూరు జలాశయంలో 0.35 టీఎంసీల సామర్థ్యం మేర పూర్తి స్థాయిలో నీటితో నింపుతున్నారు.

News May 15, 2024

మరో కీలక ఎన్నికకు ఖమ్మం సిద్ధం

image

లోక్‌సభ పోరు ముగియగా మరో సమరానికి ఖమ్మం సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్‌గా అశోక్ పోటీ చేస్తున్నారు.

News May 15, 2024

మరో కీలక ఎన్నికకు వరంగల్ సిద్ధం

image

లోక్‌సభ పోరు ముగియగా మరో సమరానికి వరంగల్ సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్‌గా అశోక్ పోటీ చేస్తున్నారు.

News May 15, 2024

MDK: మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసి.. డబ్బులు స్వాహా చేస్తున్నారు !

image

రేగోడు మండలంలో వాట్సాప్ గ్రూపుల్లో లింకులు పంపిస్తూ డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు చేస్తూ బ్యాంకు ఖాతాలోని డబ్బులు కొల్లగొడుతున్నారు. మండలానికి చెందిన మాజీ సర్పంచి కుమారుని ఫోన్ హ్యాక్ చేసి రూ. 63వేలు డ్రా చేశారు. సీఏస్సీ సర్వీస్ జాయినింగ్ గ్రూప్ పేరుతో ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తుల ఫోన్లను హ్యాక్ చేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. పలువురి ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు స్వాహా చేశారు.

News May 15, 2024

PUలో రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మ. 12:30 గంటల వరకు, 5, 6వ సెమిస్టర్ విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
SHARE IT..