Telangana

News September 7, 2024

HYD కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీలుగా వీరే!

image

HYD సిటీ కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీగా బాధ్యతలు చేపట్టిన వారిలో హసన్ అలీ ఖాన్ మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత B.N. కాలియా రావు, S.P.సాతూర్, విజయ రామారావు, ప్రభాకర్ రావు, అప్పారావు, RP సింగ్ IPS ఉన్నారు. ఇదే కోవలోకి 2021లో HYD సీపీగా విధులు నిర్వర్తించిన CV ఆనంద్ రానున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో 2024లో మరోసారి HYDకి సీపీ కానున్నారు. 1945 నుంచి 4 ఏళ్లకు మించి సీపీగా ఎవరూ లేరు.

News September 7, 2024

సూర్యాపేట: క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి

image

ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామ శివారులో క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి చెందాడు. కూడలికి చెందిన బానోతు హీరా వాటర్ మోటర్ తీయబోయి నీళ్లలో చిక్కుకుని మరణించాడు. గతంలో అదే క్వారీలో మిడతనంపల్లికి చెందిన ముగ్గురి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. హీరా మృతితో విషాదం అలుముకుంది. 

News September 7, 2024

HIGH ALERT: ఖమ్మం జిల్లాకు అతిభారీ వర్షాలు 

image

ఖమ్మం జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజులు జిల్లాలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మున్నేరు, ఆకేరుకు భారీ వర్షాల వల్ల వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని పేర్కొంది.

News September 7, 2024

MDK: మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలలో ఆదివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుందని ఐఎండి హెచ్చరించింది.

News September 7, 2024

కరీంనగర్ జిల్లాలో మళ్లీ వర్షం..

image

తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

News September 7, 2024

సుభాన్‌ను అభినందించిన అసదుద్దీన్ ఓవైసీ

image

ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై ఇటీవల జరిగిన వరదల్లో చిక్కుకున్న 9 మంది ప్రాణాలు సుభాన్ జేసీబీ సహాయంతో కాపాడిన విషయం తెలిసిందే. శనివారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ధైర్యసాహసాలను మెచ్చుకొని అభినందించారు. అతనికి రూ.51,000 నగదు ఇచ్చి సత్కరించారు. ఖమ్మంలో డబల్ బెడ్రూమ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి సిఫార్సు చేశారు.

News September 7, 2024

దేశంలోనే సెకండ్ ప్లేస్.. నల్గొండకు రూ.25లక్షలు

image

నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛ, వాయు సర్వేక్షన్‌లో 2024లో రెండో స్థానం సాధించడంతో రూ.25 లక్షల ప్రోత్సాహకం లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ సీఎం బజానా చేతుల మీదుగా ఈరోజు నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అందుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ… నల్గొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

News September 7, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో శిశువు

image

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేట మెదక్ రహదారి పక్కన అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాంల వద్ద చెత్తకుప్పలో పడవేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.

News September 7, 2024

HYD: రాజ్‌భవన్‌లో వినాయక చవితి వేడుకలు

image

HYD సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గణేశుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ గణేశ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు సాదా బంకమట్టితో పర్యావరణ అనుకూలంగా తయారు చేశారు. విషరహిత కూరగాయల రంగులతో పెయింట్ వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

News September 7, 2024

HYD: రాజ్‌భవన్‌లో వినాయక చవితి వేడుకలు

image

HYD సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గణేశుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ గణేశ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు సాదా బంకమట్టితో పర్యావరణ అనుకూలంగా తయారు చేశారు. విషరహిత కూరగాయల రంగులతో పెయింట్ వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.