Telangana

News July 19, 2024

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం తేజ ఏసీ మిర్చి ధర స్వల్పంగా పెరగగా.. మిగతా ధరలు తగ్గాయి. తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.17 వేలు పలకగా.. నేడు రూ.17,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.16 వేలు పలకగా.. నేడు రూ.15,200 ధర వచ్చింది. వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ. 14 వేల ధర రాగా.. నేడు రూ.13,500 వచ్చింది.

News July 19, 2024

ఏకరూప దుస్తుల కుట్టు కూలీ నిధులు మంజూరు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తుల కుట్టు కూలీ నిధులను విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఈ దుస్తులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా సమాఖ్యలు కుట్టి పాఠశాలలకు అందించాయి. ఒక్కో జతకు రూ.50 చొప్పున నిధులు మంజూరు చేశారు.

News July 19, 2024

ఇచ్చోడ: రెండు కీలో మీటర్లు నడిచి వైద్యం చేశారు

image

నారాయణపూర్ జీపీలోని రాజుల గూడలో వైద్య సిబ్బంది. బురద రోడ్డులో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గ్రామస్తులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 12 మంది రక్తం నమూనాలు సేకరించి, 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలకు రోగ నిరోధక టీకాలు వేశారు. హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్ఎం రేణుక, సిబ్బంది పాల్గొన్నారు.

News July 19, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి వర్షపాత వివరాలివే..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్టూరులో 43.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా గుండుమల్లో 21.8 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్లో 20.0 మి.మీ, వనపర్తి జిల్లా దగడలో 15.0 మి.మీ, గద్వాల జిల్లా భీమవరంలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 19, 2024

హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్

image

నిత్యం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలతో నరకప్రాయంగా మారిన హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణ పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ గతంలోనే పూర్తయిది. ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.

News July 19, 2024

మెదక్: EMT ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

EMR గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న EMT ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జనార్ధన్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు 20 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 19, 2024

భీమ్గల్: గుండెపోటుతో విద్యార్థిని మృతి

image

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన మహీషా(16) రోజులాగే స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలిక అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

News July 19, 2024

సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు

image

తాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్‌పీ అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అక్కడ ఏర్పడిన తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. రోజుకు 1000 క్యూసెక్కుల నీటిని ఎడమ కాలువకు విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే పొదుపుగా ఉపయోగించాలని అధికారులు కోరారు.

News July 19, 2024

హైదరాబాద్- బీజాపూర్ హైవేకు లైన్ క్లియర్

image

నిత్యం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలతో నరకప్రాయంగా మారిన హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణ పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ గతంలోనే పూర్తయిది. ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.

News July 19, 2024

లాల్‌దర్వాజా సింహవాహిని ఉత్సవాలను ప్రారంభించిన సీపీ

image

ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శిఖర పూజతో లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ రాజేందర్ యాదవ్, కమిటీ ప్రతినిధి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.