Telangana

News March 25, 2024

వనపర్తి: వికలాంగుల రాష్ట్ర నూతన కమిటీలో చోటు

image

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) ఆధ్వర్యంలో మహిళా దివ్యాంగుల సదస్సు హైదరాబాదులో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీలో వనపర్తి పట్టణానికి చెందిన దివ్యాంగురాలు లక్ష్మీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా NPRD జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ స్వామి, శ్యాంసుందర్ రెడ్డి, మీసాల మోహన్ ప్రభాకర్ శెట్టి, గట్టన్న, భాగ్యలక్ష్మి,, మంగమ్మ హర్షిస్తూ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు.

News March 25, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన BRS నేత శివకుమార్

image

మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 25, 2024

MLC ఉపఎన్నికలో పాల్గొనే అధికారులకు కలెక్టర్ సూచనలు

image

✓ ఉపఎన్నిక EVMల ద్వారా కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఉంటుంది.
✓ బ్యాలెట్‌ బాక్స్‌ ఖాళీగా ఉందని అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు చూపాలి.
✓ బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేయడం, మూసివేయడం, సీలింగ్‌ చేసే పద్ధతి గురించి తెలుసుకోవాలి.
✓ బ్యాలెట్‌ పేపర్‌ మడత పెట్టడంపై అవగాహన కలిగి ఉండాలి.
✓ పోలింగ్‌ కేంద్రంలోకి ఒకేసారి నలుగురు ఓటర్లను మాత్రమే అనుమతి.
✓ ఓటర్లు 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపినా అనుమతించాలి.

News March 25, 2024

హోలి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

ఈ హోలికి కొత్త కొత్త రంగులతో కొత్త ధనానికి మరిన్ని విజయాలకు స్వాగతం పలుకుతూ అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ బేధ భావాలు వీడి పరస్పర ప్రేమాభిమానాలతో సంతోషంగా మోదుగు పూల వంటి సహజ సిద్ధమైన రంగులతో వసంత కాలానికి నాందిగా మొదలైన హోలీ పండుగను జరుపుకోవాలని సూచించారు.

News March 25, 2024

రంగుల హోళీ.. సంతోషాల కేళి

image

హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాలం వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం. ప్రకృతి ప్రసాదించిన సహజ రంగులతో హోళీ ఆడుకుందాం సంతోషాల సంబరాలను జరుపుకుందాం.  >>HAPPY HOLI

News March 25, 2024

HYD: రాష్ట్రంలో 12 MP సీట్లు గెలుస్తాం: ఈటల

image

BRS, కాంగ్రెస్‌కి ఓటేస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని BJP మల్కాజిగిరి MP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్‌లో BJP జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రాహుల్‌కి, మోదీకి పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో ఒక్క స్కామ్ లేదని, ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారన్నారు. రాష్ట్రంలో 12 MP సీట్లు గెలుస్తామన్నారు.

News March 25, 2024

NZB జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుక జరుపుకోవాలన్నారు.

News March 25, 2024

28న సిద్దిపేటలో స్పాట్ అడ్మిషన్లు

image

సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత తెలిపారు. గ్రూప్ 1, 2, 3,4, ఎస్ఎసీసి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్సై, కానిస్టేబుల్ తదితర కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసం ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 25, 2024

మీడియా సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ (31)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తులో ఉన్న కంట్రోల్ రూమ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడానికి, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ ఏర్పాటు చేశామన్నారు.

News March 25, 2024

హోలీ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు

image

హోలీ (Holi) సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలి రోజున రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన, బైక్‌లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని పెర్కొన్నారు. వాహనాలపై గుంపులు.. గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.