Telangana

News May 14, 2024

కుటుంబ కలహాలతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. హత్యతండాకు చెందిన బాదావత్ శంకర్ కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామ సమీపంలోని పొలాల వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News May 14, 2024

MBNR: సైలెంట్‌గా క్రాస్ ఓటింగ్.. అభ్యర్థుల్లో ఆందోళన

image

జనరల్ స్థానమైన MBNRతో పాటు ఎస్సీ రిజర్వ్ స్థానమైన NGKL పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో “సైలెంట్” ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. MBNR నుంచి 31 మంది, NGKL 19 మంది బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ పార్టీకి చెందిన ఓట్లు రెండు నియోజకవర్గాల్లో వేరే పార్టీ అభ్యర్థికి క్రాస్ అయినట్లు చర్చ సాగుతోంది.  క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసి వచ్చేనో చూడాలి.

News May 14, 2024

లక్ష 30వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాం: జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ఉత్తర భారత దేశంలో ఉనికి కోల్పోతుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. నిజామాబాద్‌లో లక్ష 30 వేల మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News May 14, 2024

జహీరాబాద్: క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసొస్తుందో..?

image

జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు క్రాస్ వోటింగ్ భయం పట్టుకుంది. ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి కామారెడ్డి అసెంబ్లీ సీటు దక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించినవి అనుకొని ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జరిగిన క్రాస్ ఓటింగ్ జహీరాబాద్లో ఎవరికి కలిసొచ్చేనో చూడాలి.

News May 14, 2024

NRPT: విషాదం.. కొత్తింటి కల నెరవేరకుండానే చనిపోయాడు

image

మక్తల్ పట్టణంలోని టీవీఎస్ షోరూం నిర్వాహకుడు మహేశ్ గౌడ్ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. చింతరేవులకు చెందిన మహేశ్ మక్తల్‌లో నిర్మిస్తున్న ఇంటి దగ్గరికి సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ తెగిపడిన సర్వీస్ వైరుకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. రెండు గంటలైనా ఇంటికి రాకపోడవంతో కుటుంబీకులు వెళ్లి చూడగా పడి ఉన్నాడు. వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు నిర్ధారించారు.

News May 14, 2024

NZB: వచ్చే నెల 4 వరకు నిరీక్షించాల్సిందే..!

image

లోక్‌సభ పోరు ముగిసింది. ఓటరు తీర్పు EVMలలో నిక్షిప్తమైంది. రాజకీయపార్టీలు నెల రోజులుగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. తుది తీర్పు కోసం ఓటర్ల నిర్ణయంపై ఆధారపడ్డాయి. ZHB స్థానంలోని 16,41,410 మంది ఓటర్లు 19 మంది అభ్యర్థులు, NZB పరిధిలోని 17,04,867 ఓటర్లు 29 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు. అధికారులు EVMలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. విజేత ఎవరో తేలాలంటే వచ్చే నెల 4వ వరకు నిరీక్షించాల్సిందే..

News May 14, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలజడులు ఇక్కడే

image

*జనగామ జిల్లా ధర్మకంచ(263)లో పోలింగ్‌ను పరిశీలించేందుకు యువజన కాంగ్రెస్‌ నేత కొమ్మూరి ప్రశాంతరెడ్డి వచ్చారు. దీంతో BRS నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
*సంగెం మం. ఎల్గూరుస్టేషన్‌లోని 211 పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి ఓ యువకుడు ఫొటోతీసి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు.
*జనగామ మం.లోని గానుగుపహాడ్‌ ZPHSలో BRS, BJP నాయకులు టెంట్లు ఏర్పాటు చేశారు. వాటిని తీసేయాలని పోలీసులు సూచించగా వాగ్వాదం చోటుచేసుకుంది.

News May 14, 2024

పెద్దపల్లి, ఆదిలాబాద్ అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్!

image

ఉమ్మడి ADB జిల్లాలోని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో 12 మంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

హైదరాబాద్: నాలాలో మృతదేహం

image

ఖైరతాబాద్ విశ్వేశ్వర్ భవన్ పక్కన ఉన్న నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

HYD: నాలాలో మృతదేహం

image

ఖైరతాబాద్ విశ్వేశ్వర్ భవన్ పక్కన ఉన్న నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.