India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ లోక్‌సభలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత KNR రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి (సీబీఎస్ఈ) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2018లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి మొదటి బ్యాచ్‌కు చెందిన 29 మంది విద్యార్థులు పరీక్ష రాసి శత శాతం(100%) ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి అభినందించారు.
గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గద్వాల పట్టణం వేణుకాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. నారాయణపేట జిల్లా మండలం జాజాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్ జెండర్ జనని తన ఓటు వేశారు.
మెతుకు సీమ తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది, జహీరాబాద్ లోక్ సభ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
BJP సీనియర్ నేత అల్వాల శ్యామ్ రావు హఠాన్మరణం చెందారు. ఆదివారం అర్ధరాత్రి సమమంలో గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. శ్యామ్ రావు BJPలో ఏళ్లుగా పనిచేశారు. ప్రస్తుతం గోల్కొండ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సీనియర్ నేత మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
BJP సీనియర్ నేత అల్వాల శ్యామ్ రావు హఠాన్మరణం చెందారు. ఆదివారం అర్ధరాత్రి సమమంలో గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. శ్యామ్ రావు BJPలో ఏళ్లుగా పనిచేశారు. ప్రస్తుతం గోల్కొండ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సీనియర్ నేత మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
*పోల్ చీటీలు అందకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పేర్లు ఉండి ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు నిరాశ చెందారు.
*వావిలాలపల్లిలో ఈవీఎం పని చేయకపోవడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
*ఓటరు చీటీ మీద కేంద్రం కెన్‌క్రెస్ట్ పాఠశాల పేరు ఉండగా.. అక్కడికి వెళ్లి చూసే సరికి SR పాఠశాల బోర్డు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు.
*చిగురుమామిడి, శంకరపట్నం మండలాల్లో ఈవీఎంలు మొరాయించాయి.
ఓరుగల్లు ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వరంగల్ లోక్‌సభలో 42 మంది, మహబూబాబాద్‌లో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత వరంగల్ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
MHBDలో 70.68, WGLలో 68.29శాతం పోలింగ్ నమోదయింది. ఇక అభ్యర్థుల విషయానికొస్తే.. MHBD కంకరబోడు పాఠశాలలో BRS అభ్యర్థి కవిత, మానుకోట పీఏసీఎస్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్, వెంకటాపూర్ మం. మల్లయ్యపల్లిలో BJP అభ్యర్థి సీతారాం నాయక్‌లు ఓటేశారు. HNK టీచర్స్ కాలనీలో WGL కాంగ్రెస్ అభ్యర్థి కావ్య, KZPT ఫాతిమానగర్‌లో ఆరూరి రమేశ్, ములక్కనూర్ బాలుర ఉన్నత పాఠశాలలో BRS అభ్యర్థి సుధీర్ కుమార్ ఓటేశారు.
నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం వరకు 69.01 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 62.23 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.78 శాతం ఓటింగ్ పెరిగింది.
Sorry, no posts matched your criteria.