Telangana

News July 19, 2024

రుణమాఫీ… రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ

image

రుణమాఫీ కింద రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 83,124 రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.454.49 కోట్లను జమ చేసింది. అటు సూర్యాపేట జిల్లాలో 56,274 మంది రైతుల ఖాతాల్లో రూ.282.98 కోట్లు, యాదాద్రి జిల్లాలో 37,285 ఖాతాల్లో రూ.203.82 కోట్లను ప్రభుత్వం జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో రానున్న నాలుగైదు రోజుల పాటూ రూ.941.29 కోట్లను జమ చేయనుంది.

News July 19, 2024

MBNR: రూ.1,120.74 కోట్లు మాఫీ

image

తొలి విడతలో రూ.లక్షలోపు పంట రుణాలమాఫీకి సంబంధించి ఉమ్మడి MBNRజిల్లాలో 1,91,519 కుటుంబాల్లో 2,01,102 మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.1,120.74 కోట్ల మాఫీకాగా.. అత్యధికంగా రుణమాఫీ అయిన నియోజకవర్గాల్లో కల్వకుర్తి రూ.103.02కోట్లతో రాష్ట్రంలో 3వస్థానంలో ఉండగా.. జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. రూ.99.84కోట్లతో కొడంగల్, రూ.92.44కోట్లతో అచ్చంపేట నియోజకవర్గాలు వరుసగా 2,3 స్థానాలు దక్కించుకున్నాయి.

News July 19, 2024

వాంకిడి: భగ్గుమంటున్న టమాటా ధరలు

image

వాంకిడి మండలం కేంద్రంలో గురువారం సాగిన సంతలో టమాట కేజీ రూ.100, పెద్దగా ఉన్న (గ్రేడ్-ఏ) టమాటాలు రూ.120కు లభించాయి. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. కాగా నిన్న, మొన్నటి వరకు అందుబాటులో ఉన్న టమోటా ధర పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

News July 19, 2024

ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టుల భూ సేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ కి కావాల్సిన భూ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

News July 19, 2024

మెదక్: ‘సైబర్ నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి’

image

సైబర్ నేరాల మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల రుణమాఫీ పేరుతో వచ్చే ఫేక్ లింకులను, అపరిచిత కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.

News July 19, 2024

సైబర్ నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి: NGKL SP

image

సైబర్ నేరాల మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల రుణమాఫీ పేరుతో వచ్చే ఫేక్ లింకులను, అపరిచిత కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.

News July 19, 2024

ఆదిలాబాద్ రైతుతో మాట్లాడిన CM రేవంత్ రెడ్డి

image

తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహేందర్ అనే రైతుతో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయని CM అడుగగా రైతు ఒక ఎకరం సగం ఉన్నదని బదులిచ్చారు. 50,000 లోన్ తీసుకున్నాను ఏకకాలంలో రుణమాఫీ అవడం చాలా సంతోషంగా ఉన్నదని రైతు తెలిపారు. మీ ఊరిలో అందరికీ చెప్పాలి మీ ఆదిలాబాద్ జిల్లాకి 120 కోట్లు ఇస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

News July 19, 2024

HCA ఉమెన్ క్రికెట్ లీగ్‌కు హంసిని, అమూల్య

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉమెన్ క్రికెట్ లీగ్‌కు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హంసిని, అమూల్య ఎంపికైనట్లు కోచ్ బాగారెడ్డి తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి మహిళా క్రికెటర్ల ఎంపికలు నిర్వహించారు.

News July 19, 2024

గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించాలి: సీపీ

image

ఖమ్మం: గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం బోనకల్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రికార్డులను సీపీ పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.

News July 18, 2024

బజారత్నూర్: డిప్యూటీ CM పర్యటన రద్దు.. జిల్లాకు CM

image

బజారత్నూర్ మండలం పిప్రి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరొకసారి పర్యటన రద్దయింది. ఆయన పర్యటిస్తారన్న నేపథ్యంలో బుధవారం అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. పిప్రి గ్రామంలో ఇదివరకు కూడా పర్యటిస్తామని తెలిపి ఆఖరి నిమిషంలో పర్యటన రద్దయింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.