India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సా.6 గంటల వరకు HYDలో 46.08, మల్కాజిగిరిలో 50.12, సికింద్రాబాద్ 48.11, చేవెళ్ల 55.45 శాతం పోలింగ్ నమోదైందని ఓటర్ టర్నౌట్ పేర్కొంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 50.34 శాతం పోలింగ్ నమోదైంది. అధికారికంగా వివరాలు రావాల్సి ఉంది.
SHARE IT
కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని భీమిని మండలం తుంగళ్లపల్లి గ్రామ ఓటర్లు ఓటు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో 303 మంది ఓటర్లు ఉన్నారు. వీరు వాగు దాటి 3 కి.మీ దూరం కాలినడకన వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు సాలిగామ నుంచి 15 కి.మీ ప్రయాణించి ఓటు వినియోగించుకున్నారు.
ఓటరు జాబితాలో తన భార్య పేరు లేదని ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన NKL జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. NKL శివాలయం వీధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఓటు వేసేందుకు కుటుంబంతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. జాబితాలో అతని భార్య పేరు తొలగింపునకు గురైంది. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో తను ఓటు వేసిందని. ఇపుడు ఎందుకు లేదని బీఎల్వోలతో వాగ్వాదానికి దిగాడు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం: 67.49%.
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పోలింగ్ శాతం వివరాలు:
స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 78.54%,
పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో 71.35%,
పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ 72%,
WGL పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ 50.27%, WGL తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లో 63.5%, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 71.4%, భూపాలపల్లి 67.68%.
తిరుమలయపాలెం మండలం మేడిదపల్లిలోని పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి వివరించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.
కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని ప్రధాన పట్టణాల్లో రెండు రోజులుగా గుడ్ల లభ్యత లేదు. దీంతో గుడ్డు ధరలు పెరిగి సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఫాం వద్ద గుడ్డు ధర సుమారు 90 పైసలు పెరిగింది. రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డును రూ.6.50 నుంచి రూ. 7 వరకు విక్రయిస్తున్నారు.
కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం హాజరుకానున్నారు. భట్టి విక్రమార్కకు కమాన్ పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలకనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు తెలిపారు. కావున.. కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ఉత్సాహంగా ఓటు వేయడానికి వచ్చిన మహిళ ఓటు వేసిన అనంతరం మృతి చెందిన విషాద ఘటన చేర్యాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చేర్యాల మండల కేంద్రంలోని పెద్దమ్మ గడ్డ బాలుర పాఠశాలలో.. పట్టణానికి చెందిన సరోజన(75) ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటికి రాగానే గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓటేసి వచ్చి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం రామారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన మొల్ల షఫీ (48) లైన్లో 30 నిమిషాలు నిలబడి ఓటు వేశారు. ఇంటికెళ్లిన తర్వాత గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో HYDలో ఇప్పటివరకు రూ.23,87,06,012 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.26,06,11,049 విలువ గల ఇతర వస్తువులు, 28,150.805 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశామని, 380 మందిపై కేసులు నమోదు చేసి 383 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.