Telangana

News July 18, 2024

అంకాపూర్ చికెన్ తినిపిస్తావా.. బోధన్ రైతుతో CM రేవంత్

image

అంకాపూర్ చికెన్ తినిపిస్తావా? లేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన యువ రైతు రవిని అడిగారు. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవితో మాట్లాడుతూ.. చికెన్ గురించి అడిగారు.

News July 18, 2024

ADB: మద్యం మత్తులో మహిళ హంగామా

image

మద్యం మత్తులో ఒక మహిళ ఆర్టీసీ బస్సులో హంగామా సృష్టించింది. ఆదిలాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు గురువారం నిర్మల్‌కు బయలుదేరింది. మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ ఆ బస్సు ఎక్కి ఇబ్బందులకు గురిచేసింది. మహిళను బస్సు దిగమని కండక్టర్ సూచించినప్పటికీ దిగనని మొండికేసింది. దీంతో బస్సును కలెక్టర్ చౌక్ వద్ద నిలిపివేశారు. మహిళా పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా బస్సులోంచి కిందికి దింపేసి మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు.

News July 18, 2024

ములుగు: రిజిస్టర్ కార్యాలయంలో మతాంతర వివాహం

image

ములుగు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన కుమారుడు భరత్, తస్లీమ్‌లకు ఆదర్శ వివాహాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ బిక్షపతి హాజరై మాట్లాడుతూ.. మతాంతర వివాహం చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. నేటి సమాజంలో వరకట్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఆదర్శ వివాహం చేసుకోవడం హర్షనీయమన్నారు.

News July 18, 2024

HYD: ఐటం సాంగ్‌లో KCR మాటలు.. డైరెక్టర్‌పై ఫిర్యాదు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ BRS యువజన నాయకులు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR మాటలను వాడటం ఏంటన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఐటం సాంగ్‌లో ఉన్న KCR మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పరి విజయ్, మోతే రాజు, వినయ్, రాకేశ్, వినయ్ కలిసి ఈ ఫిర్యాదు చేశారు.

News July 18, 2024

HYD: ఐటం సాంగ్‌లో KCR మాటలు.. డైరెక్టర్‌పై ఫిర్యాదు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ BRS యువజన నాయకులు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR మాటలను వాడటం ఏంటన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఐటం సాంగ్‌లో ఉన్న KCR మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పరి విజయ్, మోతే రాజు, వినయ్, రాకేశ్, వినయ్ కలిసి ఈ ఫిర్యాదు చేశారు.

News July 18, 2024

ఎత్తిపోతల పనులు వేగం పెంచాలి: సీఎం

image

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో గురువారం సమావేశంలో సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ.. పనులలో వేగం పెంచాలని, ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు. దీంతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News July 18, 2024

మెదక్ కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

మెదక్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా శాంతిభద్రతలకు పరిరక్షించడంలో కింది స్థాయి అధికారులను సమన్వయం చేస్తూ ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా పగడ్బందీగా చర్యలు చేపడతామని చెప్పారు.

News July 18, 2024

మేడిగడ్డ బ్యారేజీకి 53,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజికి 53,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. గేట్లు ఎత్తి దిగువకు అంతే నీటిని బయటకు పంపిస్తున్నారు.

News July 18, 2024

ఉమ్మడి KNRలో అత్యంత భారీ వర్షాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల వానలు పడుతున్న సంగతి తెలిసిందే.

News July 18, 2024

KNR: బ్యాంకర్లు నిబంధనలు పాటించాలి: కలెక్టర్

image

రైతు రుణమాఫీ అంశంలో బ్యాంకర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 35,686 రైతు కుటుంబాలకు సంబంధించిన 37,745 బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం 194.64 కోట్లు జమ చేయనుందన్నారు. రేషన్ కార్డును కేవలం రైతు కుటుంబాల గుర్తింపు కోసమే ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.