India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో BJP కొత్త శక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో BJP సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.
కొడంగల్ పరిధి కోస్గి మండల శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం భిచ్చాల్ గ్రామానికి చెందిన విష్ణు గౌడ్(18) బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నాడు. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం.
HYD శివారు శంషాబాద్ పరిధి నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన సట్టి రుక్కమ్మ 104 ఏళ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక వయస్కురాలు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రుక్కమ్మ నిలిచారు. ఎంతో మందికి రుక్కమ్మ ఆదర్శమని పలువురు నాయకులు ఆమెను కొనియాడారు.
HYD శివారు శంషాబాద్ పరిధి నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన సట్టి రుక్కమ్మ 104 ఏళ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక వయస్కురాలు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రుక్కమ్మ నిలిచారు. ఎంతో మందికి రుక్కమ్మ ఆదర్శమని పలువురు నాయకులు ఆమెను కొనియాడారు.
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దపల్లిలో దివ్యాంగుడైన అజ్మీరా రవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతడికి రెండు చేతులూ లేకపోవటంతో ఎన్నికల సిబ్బంది వేలికి సిరా చుక్క వేశారు. వైకల్యాన్ని లెక్క చేయకుండా ఓటు వేయడానికి ముందుకు వచ్చిన రవిని పలువురు అభినందిస్తున్నారు.
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు క్రమ సంఖ్య 4వ నంబర్ కలిగిన టీ షర్టును ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి బీజేపీ కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి రాజేందర్ రావుపై ఎన్నికల సంఘం అధికారులు కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన తోకల గంగాధర్ తల్లి మల్లు అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఓటు హక్కును గంగాధర్‌తో పాటు ఆయన భార్య ప్రవళిక వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గంగాధర్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తనయుడు కొమిరెడ్డి కపిల్ పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లండన్ నుంచి సోమవారం మెట్‌పల్లికి వచ్చారు. పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి కుటుంబ సమేతంగా వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే భాదలోనూ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీవ్ర దుఖంలో ఓటువేసి పలువురి మన్ననలు పొందారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-65.00%, స్టే.ఘ-74.64%, పాలకుర్తి- 68.41%, పరకాల-70.20%, వర్ధన్నపేట-66.43%, వరంగల్ ఈస్ట్-59.43%, వరంగల్ వెస్ట్-47.00%గా ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.