Telangana

News March 24, 2024

మిర్యాలగూడ విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి 

image

రాజ్యాంగ విలువలను కాపాడటానికి ఏర్పడిన పౌర సమాజ వేదిక జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుత దేశంలో ‘రాజ్యాంగ విలువల పరిస్థితి ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో MLG కేఎన్ఎం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎండీ. యాస్మిన్ మొదటి బహుమతి సాధించింది. ప్రొఫెసర్ హరగోపాల్ ప్రైజ్ అందజేశారు.

News March 24, 2024

NRPT: నేడు రజాకార్ సినిమా ఉచిత ప్రదర్శన

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మహేశ్వరీ థియేటర్‌లో BJP ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో రజాకార్ సినిమాను ఆదివారం ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు పార్టీ మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు తెలిపారు. తెలంగాణ చరిత్ర, రజాకార్ల అణచివేత, ప్రజలు పడిన కష్టాలు, విముక్తి పొందిన చరిత్రను దర్శకుడు అద్భుతంగా చూపించారన్నారు.

News March 24, 2024

హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో..!

image

నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

సికింద్రాబాద్‌ చరిత్రలో ఆ పార్టీలదే హవా!

image

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ హవా కొనసాగింది. లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ సార్లు ఇక్కడ హస్తం అభ్యర్థులే గెలుపొందారు. 1957లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పాగా వేసిన కాంగ్రెస్.. 11 సార్లు గెలిచింది. అలాగే బీజేపీ ఐదు సార్లు గెలిచింది. కాంగ్రెస్ జోరుకు 1991లో బీజేపీ అడ్డుకట్ట వేసింది. కాగా గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి: కౌశిక్ రెడ్డి

image

బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారని, ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో నాగేందర్‌ పేరు ఉందని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలిశామని కౌశిక్ రెడ్డి చెప్పారు.

News March 24, 2024

కామారెడ్డి: ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు వందమంది బీజేపీ మండలాధ్యక్షుడు తుకారం ఆధ్వర్యంలో బీజేపీ చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మాధవరావు, పండిత్ రావ్ పటేల్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

News March 24, 2024

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క

image

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు.

News March 24, 2024

ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ శనివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.