Telangana

News July 18, 2024

కరీంనగర్: కొనసాగుతున్న DSC పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా DSC పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5 వరకు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:40 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 5, పెద్దపల్లి జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News July 18, 2024

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మహిళల మార్క్

image

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మహిళలు మార్క్ చూపిస్తున్నారు. కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారదాదేవి, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సహా రెండు జిల్లాల్లో ఇతర ముఖ్య అధికారులు మహిళలే కావడం విశేషం. రాణి రుద్రమదేవి పరిపాలించిన వరంగల్ నగరంలో మహిళా అధికారులు అంకితభావంతో సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ తమ మార్క్ చూపిస్తున్నారు.

News July 18, 2024

HYD: ఇంకా ఎంత మంది ఇలా..?

image

జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో విహాన్ చనిపోయిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.గతంలోనూ సాత్విక్, ప్రదీప్ కూడా ఇలానే చనిపోయారు. తనూశ్రీ అనే చిన్నారిపై కుక్కలు దాడి చేయగా చేతి వేళ్లు తీసేశారు. గ్రేటర్‌ HYDలో 6లక్షలకు పైగా కుక్కలు ఉండగా ఆపరేషన్లు చేసే సంరక్షణ కేంద్రాలు 5, కుక్కలు పట్టే వాహనాలు 30మాత్రమే ఉండడం గమనార్హం. పదేళ్లలో కుక్క కాటు కేసులు3,36,767 నమోదయ్యాయి. నిత్యం చాలా మంది గాయాలపాలవుతున్నారు.

News July 18, 2024

HYD: ఇంకా ఎంత మంది ఇలా..?

image

జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో విహాన్ చనిపోయిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.గతంలోనూ సాత్విక్, ప్రదీప్ కూడా ఇలానే చనిపోయారు. తనూశ్రీ అనే చిన్నారిపై కుక్కలు దాడి చేయగా చేతి వేళ్లు తీసేశారు. గ్రేటర్‌ HYDలో 6లక్షలకు పైగా కుక్కలు ఉండగా ఆపరేషన్లు చేసే సంరక్షణ కేంద్రాలు 5, కుక్కలు పట్టే వాహనాలు 30మాత్రమే ఉండడం గమనార్హం. పదేళ్లలో కుక్క కాటు కేసులు3,36,767 నమోదయ్యాయి. నిత్యం చాలా మంది గాయాలపాలవుతున్నారు.

News July 18, 2024

ఉమ్మడి ఖమ్మం రీజియన్‌కు 25 కొత్త బస్సులు: RM KMM

image

ఉమ్మడి ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోలకు త్వరలో 25 కొత్త బస్సులు రానున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ అన్నారు. ఎక్కువగా తిరిగిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. రీజియన్‌లో ప్రతిరోజు 2.42 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న బస్సుల ద్వారా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు ఆయన చెప్పారు.

News July 18, 2024

డీసీసీబీ పరిధిలో రూ.908.27 కోట్లు

image

రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఖమ్మం డీసీసీబీ పరిధిలో రూ.908.27 కోట్ల మేర పంట రుణాలు మాఫీ అయ్యే అవకాశముంది. నాలుగు జిల్లాల్లో వ్యాపించి ఉన్న డీసీసీబీ పరిధిలోని 100 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న 1,69,864 మంది రైతులు అర్హత సాధించారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన 1,16,291 మంది రైతులకు రూ.647.76కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి.

News July 18, 2024

యాదాద్రి: లంచం తీసుకుంటున్న వీడియో వైరల్.. హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

సంస్థాన్ నారాయణపురం మండలంలో భూ వివాదంలో జోక్యం చేసుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ భూ తగాదా విషయంలో బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు విచారణ జరిపించారు. హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 18, 2024

21 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గురువారం ఉదయం గోదావరి వరద నీటిమట్టం 21 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద ఉద్ధృతి ఎక్కువ ఉండడంతో భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

News July 18, 2024

నిర్మల్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడు మృతి చెందడంతో గుండెపోటుతో తల్లి మృతి చెందిన ఘటన లక్ష్మణ్‌చందా మండలంలో చోటుచేసుకుంది. రాచాపూర్ గ్రామానికి చెందిన బక్కన్న, ఎర్రవ్వలకు ఓ కుమారుడు, ముగ్గరు కుమార్తెలు. కుమారుడు సాయన్న(40) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందాడు. దీంతో మనోవేదనకు గురైన అతడి తల్లికి గుండెపోటు వచ్చింది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

News July 18, 2024

MBNR: డీఎస్సీ అభ్యర్థులకు దారులు తెలుపుతున్న ట్రాఫిక్ సిబ్బంది

image

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో MBNR జిల్లా పోలీసులు వినూత్నంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి దారులు తెలుపుతున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న కూడలిలో ట్రాఫిక్ సిబ్బంది కార్డు పట్టుకొని సమయానికి పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. జిల్లాలో ఫాతిమా విద్యాలయం క్రిస్టియన్ పల్లి, జేపీఎంసీ ధర్మపురం సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.