India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. HYDలోని ఎస్‌ఆర్ నగర్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

HYD బంజారాహిల్స్ NBT నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తన తండ్రి కేశవరావుతో కలిసి ఓటు వేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటరు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావాలని కోరారు.
రామగుండం పట్టణంలో పలువురు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం వారి బాధ్యత అని వారు తెలిపారు. పోలింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలను కల్పించారని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామంలో గుగులోత్ భద్రమ్మ ఓటు వేసేందుకు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో స్థానికులు 108కు ఫోన్ చేయగా.. గూడూరు ప్రాథమిక ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని 108 సిబ్బంది తెలిపారు.
సికింద్రాబాద్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. మోండామార్కెట్‌లోని ఇస్లామీయ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2009 తర్వాత పద్మారావు తన ఓటు తానే వేసుకోవడం విశేషం. ఆయన నివాసం పక్కా సికింద్రాబాద్ అయినప్పటికీ.. మోండా మార్కెట్ సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తోంది. ప్రస్తుతం ఆయన MP అభ్యర్థిగా నిలవడంతో ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నేత కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-30.10%, డోర్నకల్-33.33%, మహబూబాబద్-30.95%, ములుగు-29.79%, నర్సంపేట-28.50%, పినపాక-32.00%, ఇల్లందు-30.30%గా ఉన్నాయి.
హార్ట్ ఎటాక్‌తో ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. పేరాయిగూడెం బూత్ నెంబర్ 165లో ఓటింగ్ విధులకు అధికారి గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Sorry, no posts matched your criteria.