Telangana

News March 23, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోయింది. ఈరోజు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. సిద్దిపేట 40.4, శివంపేట 40.3, చిట్యాల 40.1, దామరంచ 40.0, పాల్వట్ల, ములుగు 39.6, సదాశివపేట 39.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

News March 23, 2024

HYD: రేషన్ అక్రమాలకు జైలు ఖాయం: మాచన  

image

ప్రజా పంపిణీలో అక్రమాలకు పాల్పడి, మోసం చేయడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శేరిలింగంపల్లి తారానగర్ చౌక దుకాణంలో జరిగిన అవకతవకల దృష్ట్యా చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొందరు డీలర్లు రేషన్ దుకాణాలను ఇష్టారాజ్యం నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

News March 23, 2024

HYD: అప్పుడు సన్నిహితులు.. ఇప్పుడు ప్రత్యర్థులు

image

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, సికింద్రాబాద్ నుంచి గెలిచిన తీగుళ్ల పద్మారావు BRSలో ఉండి సన్నిహితంగా ఉన్నారు.కాగా ఇటీవల దానం కాంగ్రెస్‌లో చేరగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ బరిలో ఉన్నారు. మరోవైపు BRSనుంచి పద్మారావు పోటీలో ఉండగా ప్రస్తుతం వీరు ప్రత్యర్థులుగా మారారు. ఇద్దరు MLAలు ఎంపీ బరిలో ఉండడం గమనార్హం. అయితే వీరిలో ఎవరు గెలిచినా ఉప ఎన్నికలు మాత్రం అనివార్యం కానున్నాయి.

News March 23, 2024

HYD: అప్పుడు సన్నిహితులు.. ఇప్పుడు ప్రత్యర్థులు

image

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, సికింద్రాబాద్ నుంచి గెలిచిన తీగుళ్ల పద్మారావు BRSలో ఉండి సన్నిహితంగా ఉన్నారు. కాగా ఇటీవల దానం కాంగ్రెస్‌లో చేరగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ బరిలో ఉన్నారు. మరోవైపు BRSనుంచి పద్మారావు పోటీలో ఉండగా ప్రస్తుతం వీరు ప్రత్యర్థులుగా మారారు. ఇద్దరు MLAలు ఎంపీ బరిలో ఉండడం గమనార్హం. అయితే వీరిలో ఎవరు గెలిచినా ఉప ఎన్నికలు మాత్రం అనివార్యం కానున్నాయి.

News March 23, 2024

మహబూబాబాద్ DRDO పురుషోత్తం సస్పెండ్

image

మహబూబాబాద్ DRDOగా పని చేస్తున్న పురుషోత్తంపై సస్పెన్షన్ వేటు పడింది. భూపాలపల్లిలో డీఆర్డీఏ పీడీగా కొనసాగిన సమయంలో రికార్డులను అందజేయకపోవడంపై సమగ్రమైన విచారణ అనంతరం పురుషోత్తం సస్పెండ్ అయ్యారు. డీఆర్డీవోను బాధ్యతల నుంచి తప్పించాలని పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.

News March 23, 2024

ములుగు: పురుగు మందుతాగి వ్యక్తి ఆత్మహత్య

image

ములుగు మండల కేంద్రానికి చెందిన తోడేటి అశోక్ (32) పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రోజు పొలం వద్దకు వెళ్లిన అశోక్ పురుగు మందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అశోక్ మృతిచెందాడు. భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 23, 2024

MNCL: రైలు కింద పడి సింగరేణి రిటైర్డ్ కార్మికుడి సూసైడ్

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో జరిగింది. పట్టణంలోని బృందావన కాలనీకి చెందిన మాటేటి రాజయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 23, 2024

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి: కొప్పుల ఈశ్వర్

image

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రామగుండం మున్సిపల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు.

News March 23, 2024

HYD: ఆ సీటు కచ్చితంగా గెలవాలి: సీఎం రేవంత్ రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ మల్కాజిగిరి, మేడ్చల్ ఇన్‌ఛార్జులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఇది తన సిట్టింగ్ స్థానమని మరోసారి గుర్తుచేశారు.

News March 23, 2024

HYD: ఆ సీటు కచ్చితంగా గెలవాలి: సీఎం రేవంత్ రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ మల్కాజిగిరి, మేడ్చల్ ఇన్‌ఛార్జులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఇది తన సిట్టింగ్ స్థానమని మరోసారి గుర్తుచేశారు.