Telangana

News July 18, 2024

నిజామాబాద్‌లో హత్య.. వివరాలు ఇవే.!

image

పట్టణంలోని వినాయక్ నగర్‌లో బుధవారం <<13645139>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. బిహార్‌కు చెందిన ఆనంద్(23) ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి బయటికి వెళ్లిన అతడు బుధవారం శవమై కనిపించాడు. ఆనంద్ పర్మిట్ రూంలో మద్యం మత్తులో ముగ్గురు యువకులతో గొడవ పడ్డినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. వారిలో ఒకరు అతడిపై దాడి చేయడంతో ఆనంద్ మృతి చెందినట్లు ఎస్ఐ పాండేరావు వెల్లడించారు.

News July 18, 2024

తొర్రూరు: బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

image

బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు సీఐ సంజీవ బుధవారం తెలిపారు. దంతాలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాజు కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంజీవ తెలిపారు.

News July 18, 2024

జిల్లాలో గుట్టుగా గుట్కా దందా!

image

ఖమ్మం జిల్లాలో గుట్కా దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మండలాలు, పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ జోరుగా వ్యాపారం సాగుతున్నట్లు అంటున్నారు. టాస్క్ఫోర్స్ దాడులు కొనసాగుతున్నా.. అమ్మకాలు మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు. దీంతో దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందన్నారు. గుట్కా మాఫియాపై అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News July 18, 2024

WGL: 23 వరకు బీపీఈడీ పరీక్ష ఫీజు గడువు

image

కేయూ పరిధిలో బీపీఈడీ సెకండ్ సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 23వ తేదీ వరకు గడువు ఉందని KU పరీక్షల నియంత్రణాధికారి నరసింహచారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 26వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. రూ.730 అన్ని పేపర్లు, బ్యాక్ లాగ్స్ 3 పేపర్లు రూ.630, ఇంప్రూవ్మెంట్‌కు రూ.300 చెల్లించాలి.

News July 18, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలలో రైతుల సంబరాలు
✓పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం జిల్లాలో ఎంపీ రేణుక చౌదరి పర్యటన
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం

News July 18, 2024

ADB: డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి.. ఇద్దరు జైలుకు

image

విధులు నిర్వరిస్తున్న పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు 2టౌన్ CI కరుణాకర్‌రావ్ తెలిపారు. RIMSలో కొలిపూర్‌కు చెందిన సాయికుమార్, నవీన్ ఇద్దరు మంగళవారం మద్యం మత్తులో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు. గొడవ ఆపేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI వెల్లడించారు.

News July 18, 2024

పటాన్‌చెరు: మళ్లీ ఎగిరేది బీఆర్ఎస్ జెండానే: ఎమ్మెల్యే

image

ఒక్క ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీ పోయినట్టు కాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కార్యకర్తలే పార్టీకి కొండంత బలం అన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు అద్భుతమైన పాలన అందించిందన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

News July 18, 2024

MBNR: నేటి నుండి డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు

image

MBNR జిల్లాలో ఈనెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు నిర్వహించే DSCకి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రవీందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లిలో ఫాతిమా విద్యాలయం, ధర్మాపూర్ వద్ద ఉన్న జేపీఎన్సీఈలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, కేంద్రాల్లో ప్రవేశానికి రోజూ 2 సెషన్లలో ఉ.7.30 గంటల నుంచి 8.50 గంటల వరకు, మ.12.30 నుంచి 1.50 గంటల వరకు అభ్యర్థులకు అనుమతి ఇస్తామన్నారు.
>>ALL THE BEST

News July 18, 2024

ఖమ్మం: రుణ మాఫీ.. రైతన్నలు ఫుల్ హ్యాపీ

image

ఖమ్మం జిల్లాలో 3,73,157 మంది రైతులు రూ.4,307.58 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 1,85,034 మంది రైతులు రూ.1,816.35 కోట్ల రుణాలు పొందారు. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను గురువారం ప్రదర్శిస్తారు. తొలిదఫాలో ఖమ్మం జిల్లాలో 57,857 మందికి, భద్రాద్రి కొత్తగూడెంలో 28,018 మంది కర్షకులకు రుణ విముక్తి కలగనుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 18, 2024

నిజామాబాద్ జిల్లాలో 94,010 మందికి రుణమాఫీ

image

రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ నిధులతో ఉమ్మడి NZB జిల్లాలో 94,010 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. తొలి విడతగా NZBలో 44,469, KMRలో 49,541 మంది రైతుల ఖాతాల్లో రూ.లక్ష జమకానున్నాయి. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు, ఆగస్టులో రూ.2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు.