India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HCA ఆధ్వర్యంలో నిర్వహించే అండర్-16 స్కూల్, జూనియర్ కాలేజీ క్రికెట్ టోర్నమెంట్ 2024-25లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారి నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. రూ.1000 ఫీజు చెల్లించి జట్టు పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎంట్రీలను సమర్పించడానికి చివరి తేదీ జులై 20, 2024గా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం HCA అధికారిక వెబ్‌సైట్ https://www.hycricket.org/ని పరిశీలించాలని సూచించారు. SHARE IT
ఇవాళ ప్రభుత్వం రూ.లక్ష లోపు రైతుల రుణాలను మాఫీ చేయనుంది. సా.4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడిన అనంతరం నిధులను విడుదల చేయనున్నారు. నల్గొండ జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 82,999 మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. వారి వివరాలను వ్యవసాయ అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.
ఉపాధ్యాయ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి 27,740 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వీరికోసం హనుమకొండ నగరం, పరిసరాల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి సారి ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు.
ఉపాధ్యాయ పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న DSC-2024 ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. వచ్చేనెల 5 వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలలో 34,254 ఉంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగా హాజరుకావాలని కరీంనగర్, పెద్దపల్లి DEOలు జనార్దన్ రావు, మాధవి తెలిపారు.
HCA ఆధ్వర్యంలో నిర్వహించే అండర్-16 స్కూల్, జూనియర్ కాలేజీ క్రికెట్ టోర్నమెంట్ 2024-25లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారి నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. రూ.1000 ఫీజు చెల్లించి జట్టు పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎంట్రీలను సమర్పించడానికి చివరి తేదీ జులై 20, 2024గా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం HCA అధికారిక వెబ్‌సైట్ https://www.hycricket.org/ని పరిశీలించాలని సూచించారు. SHARE IT
రుణమాఫీ పొందిన రైతులతో రైతు వేదికలలో సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై బుధవారం అయిన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతులకు పెట్టుబడి సాయం పథకం అమలుపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాల రైతుల అభిప్రాయం సేకరణ కార్యక్రమాన్ని ఈనెల 19న కరీంనగర్ శివారు బొమ్మకల్ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమెలా సత్పత్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
తల్లిదండ్రుల అశ్రద్ధ పలు ప్రమాదాలకు కారణం అవుతుంది. పిల్లలకు కనీస అవగాహన లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ ఆడుకోవడం, ఈతకొట్టడంపై లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్‌లో చోటుచేసుకుంది. వరంగల్ పెరుకవాడకు చెందిన కొందరు చిన్నారులు బుధవారం సెలవుదినం కావడంతో స్థానికంగా ఉండే ఓ మురికి కుంటలో ఈత కొడుతూ కనిపించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాద్యులు అవుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రాబోయే రోజులలో తెలంగాణలోని అన్ని రకాల కళాకారులకు ప్రోత్సాహాలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. HYDలోని రవీంద్రభారతిలో పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజా రెడ్డి ప్రదర్శించిన కాకతీయ 3వ భాగం నృత్య రూపక కార్యక్రమానికి జూపల్లి హాజరై మాట్లాడారు. CM రేవంత్ రెడ్డి సారుద్యంలో కలలు సాంస్కృతి సాహిత్యంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
పటాన్ చెరులో నిర్వహించిన సమావేశంలో సిద్దిపేట MLA మాజీ మంత్రి హరీశ్ రావు TRS కండువాతో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్ మారుస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు టీఆర్ఎస్ కండువా ధరించి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి మునుపటి ఫామ్ రావాలంటే.. పార్టీ పేరు నుంచి మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.