Telangana

News July 18, 2024

రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తా: కాసుల బాల్‌రాజ్

image

ఆగ్రోస్ సంస్థ ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తానని రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బాలరాజు మాట్లాడుతూ.. పోచారం శీనన్న నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో కూర్చొని గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

News July 18, 2024

ASF: నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News July 18, 2024

పాలేరు నవోదయ విద్యాలయంలో దరఖాస్తుల ఆహ్వానం

image

పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యా సంవత్సరం(2025- 26) ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రధానాచార్యుడు నర్సింహులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. సెప్టెంబరు 16లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News July 17, 2024

సిద్దిపేట: దేశంలో ఇదే తొలిసారి: మంత్రి పొన్నం

image

దేశంలో రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని చేయడం ఇదే మొదటిసారి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ నిర్ణయంలో కేబినెట్ మంత్రిగా తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. మరికొన్ని గంటల్లో రైతు జీవితంలో ఆనందం గడియలు మొదలు కానున్నాయని అన్నారు. ఒకేసారి రైతు పేరు మీద ఉన్న రుణాన్ని 3 పద్ధతుల్లో మాఫీ చేస్తున్నామని తెలిపారు.

News July 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.
@ ఉమ్మడి కరీంనగర్‌లో మొహర్రం వేడుకలు.
@ హుజురాబాద్ పట్టణంలో 25 మందిపై పిచ్చికుక్కల దాడి.
@ ధర్మారం మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య.
@ మల్యాల మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.
@ పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్.

News July 17, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి ముఖ్యాంశాలు

image

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో తొలిఏకాదశి వేడుకలు
★ ముధోల్ : కుళ్ళిన అంగన్వాడీ కోడిగుడ్లు
★ ఆదిలాబాద్ : పోలీసులపై డాడి.. ఇద్దరు జైలుకు
★ భైంసా : నీటిలో మునిగి ఎద్దు మృతి
★ ఆదిలాబాద్ : మహారాష్ట్ర మద్యం బాటిళ్ల పట్టివేత
★ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసానికి ఏర్పాట్లు పూర్తి
★ ఆదిలాబాద్ : యువకుడి అదృశ్యం
★ మందమర్రి : గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్
★ త్వరలో జిల్లాకు డిప్యూటీ సీఎం రాక

News July 17, 2024

NZB: విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

image

భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతిచెందిన ఘటన బుధవారం మూడవ టౌన్ పరిధిలో జరిగింది. నగరంలోని గాయత్రినగర్ చెందిన షేక్ మెహబూబ్(49) గౌతంనగర్ నూతన భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 17, 2024

గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులతో మంత్రి సమీక్ష

image

ధంసలాపురం వద్ద ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎంట్రీ ఎగ్జిట్‌పై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ ఇతర అధికారులతో డిజైన్స్‌పై చర్చ జరిపారు. ఈ చర్చలో మంత్రికి రెండు డిజైన్లను అధికారులు సమర్పించారు. రైతులు నష్టపోకుండా తక్కువ భూసేకరణ ఉండే డిజైన్ పరిశీలించి ఆ డిజైన్ ఆమోదించాలని మంత్రి సూచించారు.

News July 17, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నేడు రూ.6,25,875 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ64,992, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.41,050, అన్నదానం రూ.5,19,833 వచ్చినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.

News July 17, 2024

KNR: పిచ్చి కుక్కల దాడిలో 25 మందికి గాయాలు

image

హుజురాబాద్‌లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోజు రోజుకీ కుక్కల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. హుజురాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి ప్రతాపవాడ, మామిండ్లవాడ, గాంధీ నగర్, విద్యానగర్‌లలో 25 మందిని పిచ్చి కుక్కలు కరవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని పలు కాలనీల వాసులు కోరుతున్నారు.