India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్‌లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
HYD ఘట్‌కేసర్ PS పరిధి ఘనపూర్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒకేషనల్ కోర్సు అయిన MPHWలో మార్కులు తక్కువ వచ్చాయని మానసిక వేదనతో కాసర్ల స్వప్న(20) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె తండ్రి సతీశ్ 2009లో ఘనపూర్‌లోని హ్యాపీ ఆర్ఫన్ హోంలో చేర్పించాడు. 1000కి 700 మార్కులే వచ్చాయని ఆమె సూసైడ్ చేసుకుంది. కేసు నమోదైంది.

అసిఫాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కెరమెరి మండలం కరంజివాడ వద్ద పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సు వాగులోకి పూర్తిగా వెళ్లకుండా బస్సును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పోలింగ్ సిబ్బంది బస్సు దిగి కాలినడకన కరంజివాడ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుతో తాత, మనుమడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం కురువడంతో వరి ధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన శ్రీరాములు(43), శివరాజ్(విశాల్)(13) పిడుగుపాటుతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని సహాయక సహకారాలను త్వరలో అందిస్తామని చెప్పారు.
ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ సామాజిక మాధ్యమాల్లో రాజకీయానికి సంబంధించిన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా గ్రూపుల్లో రాజకీయానికి సంబంధించిన విద్వేషపూరితంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు రాజకీయ ప్రస్తావన పోస్టులు పెట్టొద్దని సూచించారు.
భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని భర్త వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రామారెడ్డిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కట్ట బాబు అతని భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి రావడం లేదనీ మనస్తాపం చెంది, మద్యం సేవించి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా.. అది చూసిన కానిస్టేబుల్ రంజిత్ ట్యాంక్ పైకి ఎక్కి అతనిని కాపాడాడు.
ఎన్నికల విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో వలిగొండ వాసి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మండల పరిధిలోని పహిల్వాన్ పురంకి చెందిన బొడ్డుపల్లి నరసింహ హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం ఎన్నికల విధుల్లో ఉండగా గుండె నొప్పితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
HYD మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు అలరించాయి. చెన్నై నుంచి వచ్చిన భరతనాట్య కళాకారిణి రక్షా దేవనాథన్ నట్టైకురంజి రాగం వర్ణం, జయదేవ అష్టపది అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నటి గురువు చూడామణి తన శిష్య బృందంతో మూషిక వాహన, పలుకే బంగారమయే, మాతృ దినోత్సవం సందర్బంగా ‘అమ్మ’ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

Sorry, no posts matched your criteria.