Telangana

News July 17, 2024

డీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: CP సునీల్ దత్

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు జరిగే DSC పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS చట్టం అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని 6 పరీక్ష కేంద్రాలలో జులై 18 తేదీ నుంచి ప్రతి రోజు 163 ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.

News July 17, 2024

నర్సంపేట పట్టణ కేంద్రంలో వికసించిన బ్రహ్మ కమలం

image

నర్సంపేట పట్టణ కేంద్రంలోని గోక రామస్వామి శాంతి వనంలో అరుదైన పుష్పమైన బ్రహ్మ కమలం వికసించింది. ఈ కమలం మొక్కను రామస్వామి తన శాంతి వనంలో మూడేళ్ల క్రితం నాటాడు. అది సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విచ్చుకుంది. మంగళవారం 3 గంటల ప్రాంతంలో మళ్లీ ముడుచుకోవడం ప్రత్యేకత. హిమాలయాల్లో మాత్రమే పెరిగే అరుదైన పుష్పం నగరంలో కూడా పెరగడంతో పాటు పుష్పించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

News July 17, 2024

NZB: దంపతుల ఆత్మహత్య.. నిందితురాలి అరెస్టు

image

పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన యువ దంపతులు అనిల్ కుమార్, శైలజ ఆత్మహత్యకు కారకురాలైన మృతురాలి పిన్ని కంకోళ్ల లక్ష్మిని బుధవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. యువ దంపతులు సోమవారం రాత్రి నవీపేట్ శివారులో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడిస్తూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

News July 17, 2024

ఖమ్మం: రైలు కింద పడి వ్యక్తి మృతి 

image

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని ఎర్రుపాలెం, తొండల గోపవరం గ్రామాల మధ్య రైల్వే ట్రాక్‌పై 35 సంవత్సరాల వయసు ఉన్న యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News July 17, 2024

అవిశ్వాసం నేప‌థ్యంలో కాంగ్రెస్ విప్ జారీ

image

ఆదిలాబాద్ మున్సిప‌ల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం నేప‌థ్యంలో మూడు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేతలు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. బ‌ల్దియా కార్యాల‌యంలో జ‌ర‌గ‌నున్న అవిశ్వాస స‌మావేశానికి త‌ప్ప‌కుండా హాజ‌రై మ‌ద్ద‌తు తెల‌పాల‌ని రాజ‌కీయ పార్టీలు త‌మ‌ కౌన్సిల్ స‌భ్యుల‌కు విప్‌లు జారీ చేశాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గుడిపెల్లి న‌గేష్‌ నోటీసులు గోడలపై అతికించారు.

News July 17, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు

image

డీఎస్సీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డిఇఓ రవీందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్లోని ఫాతిమా విద్యాలయం క్రిస్టియన్ పల్లి, JPNCE ధర్మాపూర్‌లో ఆన్‌లైన్ బేస్డ్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష 13 రోజులో రోజుకు 2 సెక్షన్లు జరుగుతుందని, ఉ.9 గంటల నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుందని అభ్యర్థులు హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ వెంట తీసుకురావాలన్నారు.

News July 17, 2024

ఖమ్మం: ఈతకు వెళ్లి ముగ్గురి మృతి 

image

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (s) మండలం బొప్పారంలో ఈతకు వెళ్లి ఖమ్మం జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం  అశ్వారావుపేట, జూపేడ గ్రామానికి చెందిన శావల్య రాజు (45) అతడి కూతురు శ్రావల్య ఉష (12), శ్రీపాల్ రెడ్డి (40 ) హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఓ శుభకార్యానికి వచ్చి క్వారీ గుంతలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో నీట మునిగి మృత్యువాత పడ్డారు.  

News July 17, 2024

నిజామాబాద్ జిల్లాలో అక్రమ పెన్షన్లు కట్

image

నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయి ఆ పెన్షన్ తో పాటు అసరా పెన్షన్ కూడా తీసుకుంటున్నట్లు 410 మందిని అధికారులు గుర్తించారు. వీరికి ఆగస్టు నెల నుంచి అసర పెన్షన్ నిలిపివేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇప్పటి వరకూ వారు రూ. 2.68 కోట్లు అందుకున్నట్లు వారు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం వారికి పెన్షన్ రికవరీ నోటీసులు జారీ చేయడం లేదని అధికారులు తెలిపారు.

News July 17, 2024

రైతు ఆర్థికంగా బలపడడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి

image

వ్యవసాయం మరింత లాభసాటిగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా బలపడటానికి రైతాంగానికి అండగా ఉంటామని చెప్పారు. అందుకే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.

News July 17, 2024

రైతు ఆర్థికంగా బలపడడమే తమ లక్ష్యం: మంత్రి పొంగులేటి

image

వ్యవసాయం మరింత లాభసాటిగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా బలపడటానికి రైతాంగానికి అండగా ఉంటామని చెప్పారు. అందుకే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.