Telangana

News March 23, 2024

నర్సాపూర్: డమ్మీ తుపాకీతో బెదిరించిన మేకల దొంగలు

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి శివారులో మేకలను దొంగలించేందుకు ప్రయత్నించిన భీమ్ రావు, మధు అనే ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకున్నారు. డమ్మీ తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిన ఇద్దరు యువకులు బైక్‌పై నుంచి కింద పడటంతో గాయాలయ్యాయి. దొంగలను ఆస్పత్రికి తరలించిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News March 23, 2024

కామారెడ్డిలో బాలికతో వ్యభిచారం..!

image

తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భీంగల్‌కు చెందిన సంపంగి లక్ష్మి, ఆమెతో సహజీవనం చేస్తున్న సుంకరి శంకర్‌ ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సహకరిస్తున్న లాడ్జి ఓనర్ నరసింహరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరణ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2024

ఆదిలాబాద్‌ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్..!

image

వేసవి వేళ భూరగ్భజలాలు అడుగంటి ఆదిలాబాద్‌‌లో నీటి ఎద్దడి మొదలైంది. జిల్లాలో మొత్తం 972 కొత్త తాగు నీటి పథకాలు, పాత పథకాలు 557, చేతిపంపులు 3,461, మోటార్లు 220 ఉన్నాయి. అయినా ఇంద్రవెల్లి, నార్నూర్‌ తదితర ఏజెన్సీ మండలాల్లో చేతిపంపు నుంచి నీళ్లు రావడం గగనంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఈ సమయంలో మిషన్ భగీరథ SE సురేశ్ శుభవార్త చెప్పారు. ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామానికి నీరు అందిస్తామన్నారు.

News March 23, 2024

NLG: యురేనియం కోసం మళ్లీ అన్వేషణ!

image

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైందా… అంటే అవుననే అంటున్నారు అక్కడి జనం. కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథిగృహంలో బస చేస్తూ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు.

News March 23, 2024

ఖమ్మం: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

image

కారేపల్లి బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పి.రామగోపిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ జయరాజు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి విధులకు హాజరుకాకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాలలో విద్యావలంటీర్‌ను ఏర్పాటుచేసినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News March 23, 2024

NZB: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండలంలోని బండ రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన పండరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడిపోయినట్లు తెలిపారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు కుటుంబ సభ్యులు తరలించినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడన్నారు.

News March 23, 2024

కవితా కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది: ఎంపీలు

image

ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టి అక్రంగా అరెస్ట్ చేసారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఢీల్లీలో ఎంపీలు నామా, కే.ఆర్ సురేష్‌‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో కవితా బాధితురాలని, నిందితురాలు కాదని వారు పేర్కొన్నారు. ఇన్ని రోజులు సాగదీసి, లోక్ సభ ఎన్నికలకు ముందు కేసును తెరపైకి తేవడం రాజకీయ కోణమన్నారు . తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందన్నారు

News March 23, 2024

NRPT: ‘ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేయాలి’

image

ఈనెల 28న జరిగే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. నారాయణపేట ఎంపిడివో కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లాలో మొత్తం 205 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

News March 23, 2024

‘పంటల ప్రణాళిక, జాగ్రత్తలపై దృష్టి పెట్టాలి’

image

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల ప్రణాళిక, తీసుకోవలసిన జాగ్రత్తలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా పరిశోధన సంచాలకులు డా. పి. రఘు రామిరెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, NLG జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్యర్యంలో నల్గొండ కలెక్టరేట్లో శుక్రవారం దక్షిణ తెలంగాణ మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశం నిర్వహించారు.

News March 23, 2024

మంచిర్యాల: పూర్తి మెటీరియల్ అందుబాటులో ఉంచాలి: అదనపు కలెక్టర్

image

ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్య నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమైన పత్రికలు, పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయాన్ని జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్‌సింగ్‌తో కలిసి సందర్శించి సౌకర్యాలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రంథాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.