Telangana

News July 17, 2024

ఊట్కూర్: పాముకాటుతో యువకుడి మృతి

image

ఊట్కూరు మండలం పులిమామిడికి చెందిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన బి. హనుమంతు చిన్న కొడుకు శివ(20) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతతో వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు NRPTఆసుపత్రికి తరలించగా పాము కాటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి MBNR ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెంచాడు

News July 17, 2024

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ముగ్గురు మృతి

image

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంలో క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వీరు HYD నుంచి సూర్యాపేకు పనిమీద వచ్చారు. రాజు తన కుమార్తెకు ఈత నేర్పడానికి స్నేహితుడితో కలిసి క్వారీ వద్దకు వెళ్లగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తండ్రి రాజు, అతడి స్నేహితుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News July 17, 2024

ఆదిలాబాద్: డీఎస్సీ పరీక్ష రాయనున్న 29,543 మంది

image

ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29,543 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. నిర్మల్ జిల్లాలో 342 పోస్టులకు 6,035, ADBలో 324 పోస్టులకు 9,569, MNCLలో 288 పోస్టులకు 8,262, ASFలో 341 పోస్టులకు 5,677 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

News July 17, 2024

వలిగొండ: పోలీసులపై దాడి.. నిందితులు అరెస్ట్

image

పోలీసులపై దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన వలిగొండ మండలం అరూర్‌లో జరిగింది. ఎస్సై మహేందర్ వివరాలిలా.. వలిగొండ ఠాణాకు చెందిన పోలీసులు నిరంజన్, శ్రీనివాస్ సోమవారం రాత్రి బ్లూకోట్ విధులు నిర్వహిస్తుండగా.. రోడ్డుపై నిల్చున్న ఓ ఐదుగురిని ఇంటికి వెళ్ళమని చెప్పారు. దీంతో వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News July 17, 2024

వరంగల్: రెండు మెడికల్ కాలేజీలకు 218పోస్టులు మంజూరు

image

వరంగల్ జిల్లా నర్సంపేట, ములుగులో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు 218పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కాలేజీకి 109పోస్టులు కేటాయించారు. ఇందులో 25ప్రొఫెసర్, 28అసోసియేట్ ప్రొఫెసర్, 56 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

News July 17, 2024

నేడు వనపర్తికి బేబీ సినిమా హీరోయిన్

image

నేడు వనపర్తి జిల్లా కేంద్రానికి బేబీ సినిమా హీరోయిన్ కుమారి వైష్ణవి చైతన్య రానున్నారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన ఓ షాపింగ్, జువెలరీ మాల్‌ను వైష్ణవి ప్రారంభించనున్నారు. స్థానిక కొత్తకోట రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేయనున్నారు.

News July 17, 2024

WGL: తొలి ఏకాదశి పర్వదినానికి ప్రత్యేక స్థానం: మంత్రి సురేఖ

image

తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి పండుగ ప్రజలందరి జీవితాలలో శుభాన్ని కలిగించాలని కోరుకున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు.

News July 17, 2024

కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌కి షోకాజ్ నోటీస్

image

బయ్యారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కల్పనాదేవికి రామారావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని 9 ,10 తరగతి విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో ఉన్న కొత్త పాఠ్య పుస్తకాలు ఉండగా, మాజీ సీఎం ఫొటోతో ఉన్న పాఠ్యపుస్తకాలను స్పెషల్ ఆఫీసర్ పంపిణీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్‌కి షోకాజ్ నోటీసు జారీచేశారు.

News July 17, 2024

600 మంది విద్యార్థినీలకు ఒకటే మరుగుదొడ్డి!

image

నల్గొండ జిల్లాలోని సర్కారు పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 1250 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 600 మంది విద్యార్థినీలు, 15 మంది మహిళా టీచర్లు ఉన్నారు. వీరందరికీ ఒకటే మరుగుదొడ్డి ఉండడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

News July 17, 2024

HYD: ఘోరం.. బాలుడిని 20 నిమిషాలు కరిచిన కుక్కలు

image

HYD జవహర్‌నగర్ పరిధిలో కుక్కల దాడిలో <<13644434>>బాలుడు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులు నెల కిందట HYD వచ్చారు. వారి కొడుకు విహాన్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు దాడి చేసి 20 నిమిషాలు కరిచాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి కుక్కలను తరిమాడు. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.