India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్ వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొని లచ్చమ్మ(70) మృతి చెందింది. కాగా, స్టేషన్ ఘన్‌పూర్లో కారు-స్కూటీ ఢీకొని రమేశ్(55) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓటరే నిజమైన నిర్ణేత. కానీ WGL జిల్లా దుగ్గొండి (M) గిర్నిబావిలో పాఠశాల లేదని పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. 2018లో ఏర్పడిన గిర్నిబావి పంచాయతీ.. NSPTకు 10KM దూరంలో ఉంది. ఇక్కడి ఓటర్లను రెండు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. 936 మంది ఓటర్లు ఉండగా.. మందపల్లికి 530, తొగర్రాయికి మరో 406 మంది ఓటర్లను కేటాయించారు. గిర్నిబావిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..”881 పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అతి సమస్యాత్మకమైన 58 పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలు మోహరిస్తున్నామని, పోలింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం” అని వెల్లడించారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 1,896 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో వెబ్ క్యాస్టింగ్ చేపట్టనుండగా, 621 పోలింగ్ కేంద్రాల బయట వైపు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 103 లోకేషన్లలో 230 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే, వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవలకు సంబంధించిన వారు 2,728మంది, ఉద్యోగులు 8,199మంది ఓట్లు వేశారన్నారు.
భువనగిరికి చెందిన మూడేళ్ల కుమారుడు శ్రీయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. రెండు నిమిషాల్లో 55 దేశాలకు సంబంధించిన జెండాలను చూసి ఆ దేశం పేరు చెబుతున్నాడు. 12 రేఖా గణిత పటాలు, 12 రంగులు, 22 జంతువుల పేర్లు చకచకా చెప్పేస్తాడు. న్యూఢిల్లీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ధ్రువపత్రంతో పాటు రికార్డు బుక్‌ను అందించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ పార్లమెంట్‌లో అంతగా జోష్ కనిపించలేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంతో చాలా గ్రామాల్లో ప్రచారం పూర్తిగా నిర్వహించలేకపోయారు. పలువురు నాయకులు సైతం వడదెబ్బకు గురికావడంతో కార్యకర్తలు పగటి పూట ప్రచారం చేయాడానికి అంతగా ఆసక్తి చూపలేదు. పార్టీలకు చెందిన కీలక నేతలు మాత్రమే ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈనెల 13న నిర్వహించే పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు రూ.2.41కోట్ల నగదు, రూ.1.81కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామని, నియోజకవర్గంలో పరిధిలో 927 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో ఎన్నికల సరళిని పరిశీలించనున్నట్లు” వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు తనిఖీల్లో రూ.3,47,31,750 నగదు సీజ్ చేయగా, సరైన ఆధారాలు చూపించడంతో రూ.2,61,05,180 నగదు విడుదల చేశామని సీపీ సునీల్ దత్ తెలిపారు. రూ.1,06,40,532 విలువైన మద్యం, రూ.24,39,600 విలువైన గంజాయితో పాటు రూ.20,07,500 విలువైన ఇతర సామగ్రి సీజ్ చేశామని వెల్లడించారు. పోలింగ్ సమీపిస్తున్నందున తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
HYD నగర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే హయత్ నగర్, LBనగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు బస్‌స్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి మే 13న ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం మరిస్తే.. మన హక్కులపై పోరాడే స్వభావాన్ని కోల్పోతామని సూపర్వైజర్ సునీత తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రెండు నెలలుగా ప్రచార సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించిన పార్టీలు ఎన్నికల నియమావళిని అనుసరించి నిలిపివేశాయి. కాగా పోలింగ్‌కు ముందు రోజు నాటికే ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.