India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోతుండటం రైతులను కలవరపెడుతుంది. నల్లవాగు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. సింగూరు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 13.565 TMCలుగా ఉన్నాయి.
గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI రాజు వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తునికినూతల గ్రామానికి చెందిన వడ్త్యా శ్రీని, పద్మజల దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు. నగరానికి కొన్నేళ్లక్రితం వచ్చి నాదర్‌గుల్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం శ్రీని, పద్మజ మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. దీంతో పద్మజ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్(ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఆయన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడి ఇన్ఫెక్షన్ బంగ్లాలో సీజీఎం శివశంకర ప్రసాద్, జీఎం లతోపాటు ఇతర ప్రతినిధులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఓడీఎఫ్ సమస్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరిస్తానని రఘునందన్ అన్నారు.
ప్రతి సంవత్సరం ఇచ్చే జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో రవీందర్ మంగళవారం పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు ఈనెల 18వ తేదీ వరకు గడువును పొడిగించారని చెప్పారు. http:///nationalaward stoteachers.education.gov.in అనే పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన KPHB పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. రణధీశ్ (20) KPHB పరిధిలోని ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి మియాపూర్‌లోని స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో JNTU మెట్రో స్టేషన్ వద్ద పాల వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన KPHB పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. రణధీశ్ (20) KPHB పరిధిలోని ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి మియాపూర్‌లోని స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో JNTU మెట్రో స్టేషన్ వద్ద పాల వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు హత్య చేసినట్లు కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని చౌకన్పల్లికి చెందిన మారుతిని తన కొడుకు నరసప్ప డబ్బులు అవసరమని మంగళవారం అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కోపోద్రిక్తుడై నరసప్ప ఆవేశంతో గొడ్డలితో తండ్రిపై దాడి చేశారు. మారుతికి చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ యువకుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. ఆటోనగర్‌కు చెందిన షేక్ మాజిద్(31) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సోమవారం మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన మాజిద్ బాత్‌రూమ్‌లో ఉన్న యాసిడ్ తాగాడు. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై SI మొగులయ్య కేసు నమోదు చేశారు.
తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ వివరాల ప్రకారం.. గుండాల మండలం సాయనపల్లికి చెందిన రమ్య గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఇటీవల ఇంటికి వచ్చిన రమ్యను మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించారు. హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో బుధవారం భారీగా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం వంటివి జరగవచ్చని పేర్కొంది. మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి అని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.