Telangana

News May 12, 2024

కల్హేర్: దూడను చంపిన చిరుత

image

నాగధర్- సంజీవర్‌రావుపేట్ శివారులో పోలంలో దూడను చిరుత చంపేసింది. రైతు గోపాల్‌రెడ్డి వివరాలిలా.. గోపాల్‌రెడ్డి పొలంలో పశువులను మేపుతున్నారు. భోజనానికి ఇంటికి వెళ్లగా.. చిరుత దాడిచేసి దూడను చంపినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అటవీశాఖ, పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని నాగదర్ FBO శ్రీకాంత్ సందర్శించి, పంచనామా నిర్వహించారు.

News May 12, 2024

KTDM: ప్రచారం నుంచి వచ్చి ఉరేసుకుని సూసైడ్ 

image

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకవాగు ఏరియాకు చెందిన మందలపు స్వాతి(38) శనివారం మధ్యాహ్నం వరకు ఓ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన తర్వాత ఉరి వేసుకొని మృతి చెందింది. స్వాతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 12, 2024

ముగిసిన ప్రచారం.. శబ్దానికి విరామం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కంటే 48 గంటల ముందే అన్ని పార్టీల వాళ్లు ప్రచారం ఆపేశాయి. రెండు నెలలుగా ప్రచార వాహనాలు, పాటలతో హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచార వాహనాలకు అంటించిన పార్టీ స్టిక్కర్లు, హోర్డింగులకు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు తొలగించేశారు.

News May 12, 2024

కరీంనగర్: ఎడారి దేశంలో యువకుడి మృతి

image

జీవనోపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన భీమారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోత్కురావుపేట గ్రామానికి చెందిన గణేశ్(26) గత కొన్ని నెలల క్రితం అల్-ఎయిన్ (UAE)వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడి మృతి చెందాడు. రెండురోజుల క్రితం స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గణేశ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News May 12, 2024

వరంగల్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

image

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన తన్మయి తన చెల్లి TS F SET పరీక్ష కోసం శనివారం ఘట్ కేసర్‌కు బయలుదేరారు. ఈక్రమంలో కారు ఆలేరు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాలీని ఢీకొట్టింది. ప్రమాదంలో తన్మయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వరంగల్ MGMకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. తన్మయి వరంగల్ వాగ్దేవి కాలేజీలో బీటెక్ చదువుతోంది.

News May 12, 2024

అమెరికాలో ఖమ్మం యువకుడి మృతి

image

ఖమ్మానికి చెందిన విద్యార్థి లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి అమెరికాలోని ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా.. రాకేష్(24) అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈనెల 8న స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు రాకేశ్‌తో పాటు అతని స్నేహితుడు మునిగిపోయారు. మృతదేహాలు మరుసటి రోజు లభ్యమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని ఖమ్మానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.  

News May 12, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేటలో జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. కోదాడ – జడ్చర్ల రహదారిపై అంగడిపేట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోయించుకుని వస్తున్న ఆటోను హెడ్ కానిస్టేబుల్ మర్యాదాస్ ఆపాడు. ఈ క్రమంలో వెనకనుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News May 12, 2024

NLG: ఓటరు కార్డు లేనివారికి ప్రత్యామ్నాయ కార్డులు

image

ఓటరు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 1.పాస్పోర్టు 2.డ్రైవింగ్ లైసెన్స్, 3.ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు, కార్డులు 4.బ్యాంకు, పోస్టాఫీసు పాస్ బుక్ 5.పాన్ కార్డు, 6.ఆర్టీఐ ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు, 7.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్ కార్డు, 8.కార్మిక శాఖ ఇచ్చిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం, 10.ఆధార్ కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

News May 12, 2024

మల్కాజ్‌గిరి: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

image

ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్‌ ఓటర్లదే కీలక భూమిక. లోక్‌సభ నియోజక వర్గాలన్నింటిలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఓటర్లు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

News May 12, 2024

మల్కాజ్‌గిరి: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

image

ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్‌ ఓటర్లదే కీలక భూమిక. లోక్‌సభ నియోజక వర్గాలన్నింటిలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఓటర్లు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.