India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎగువన కురుస్తోన్న వర్షాలకు జూరాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. అల్మట్టి జలాశయానికి మంగళవారం వరకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద చేరింది. నారాయణ్‌పూర్ జాలాశయంలో 37.64TMCలకు గానూ 28.67TMCల నిల్వ ఉంది. దీంతో జూరాలకు 3వేల క్యూసెక్కులను వదులుతుండగా దాన్ని 60వేల వరకు పెంచే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ అహ్మద్ తెలిపారు. జూరాల సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ 7.68 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈనెల 18న రైతుల ఖాతాల్లో తొలి విడుతగా రూ.లక్ష జమ చేస్తామని CM ప్రకటించారు. 2018-12-12 నుంచి 2023-12-9 వరకు పంట రుణాలు రూ.2లక్షల్లోపు మాఫీ కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్న 4.50 లక్షల మందికి రూ.3,509 కోట్లు కావాలని అధికారుల అంచనా. ADB 1.17- రూ.1030.61కోట్లు, మంచిర్యాల 0.94- రూ.804.22, నిర్మల్ 1.20- రూ.952.39కోట్లు, ASF 1.19- 722.18 కోట్లు అవసరం కానున్నాయి.
జగిత్యాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాన్ని భారత వాతావరణ శాస్త్ర విభాగం, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీంతో వాతావరణ పరిస్థితులను 5రోజుల ముందుగానే తెలుసుకోవచ్చు. వాతావరణాన్ని అంచనా వేసి సంబంధిత వాతావరణ కేంద్రానికి పంపిస్తారు. ఆ వివరాలు వాతావరణ కేంద్రం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయని ఖమ్మం ఆదాయపన్ను అధికారి ఉమామహేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీడీవోలకు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుపై ఆదాయపన్ను అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి ఆదాయపన్ను ముఖ్య ఆదాయ వనరులని, ఆదాయపన్ను క్రింద వసూలయ్యే ప్రతి పైసా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చవుతుందన్నారు.
సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగ భద్రత, కార్మిక సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర్ ప్రసాద్, జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విజయ్ దత్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, బీఎంఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా పీర్ల ఊరేగింపుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్ అన్నారు. మంగళవారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని ఉట్కూర్ మస్జిద్ చావిడిలో పీర్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిర్వాహకులు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. మొహరం వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని నిర్వాహకులకు ఎప్పీ సూచించారు.
నేడు తొలి ఏకాదశి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRతో పాటు రాజధానికి చేరువలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చిలుకూరు బాలాజీ, వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి,స్వర్ణగిరి, మేడ్చల్ బద్రీనాథ్, చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి, బంజారాహిల్స్ పూరీ జగన్నాథ్, బిర్లా మందిర్, శామీర్ పేట రత్నాలయం, సంఘి, బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, అమ్మపల్లి సీతారామాలయంలో ఏర్పాట్లు చేశారు. SHARE IT
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కాంట్రాటర్‌తో మాట్లాడుతూ.. రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, వాహనా దారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నీరడి దేవరాజ్, వాసు, కోట్ల భాస్కర్, వెంకట్ రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.
నేడు తొలి ఏకాదశి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRతో పాటు రాజధానికి చేరువలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చిలుకూరు బాలాజీ, వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి,స్వర్ణగిరి, మేడ్చల్ బద్రీనాథ్, చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి, బంజారాహిల్స్ పూరీ జగన్నాథ్, బిర్లా మందిర్, శామీర్ పేట రత్నాలయం, సంఘి, బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, అమ్మపల్లి సీతారామాలయంలో ఏర్పాట్లు చేశారు. SHARE IT
గురుపౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 21న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తులకు TS- RTCగోదావరిఖని నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు DMనాగభూషణం తెలిపారు. ఈనెల 19న రాత్రి 7 గంటలకు గోదావరిఖనిలో బయలుదేరి కరీంనగర్‌కు చేరుకొని అక్కడి నుంచి రాత్రి 8:45కు ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు www.tsrtconline.inలో సర్వీస్ no.69999 బుక్ చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.