Telangana

News July 17, 2024

ములుగు: రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేలం పాట

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయలు పూజా సామగ్రి అమ్ముకోవడానికి మంగళవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో 2024-25 సంవత్సరానికి గాను రూ.5,20,500 పాట పాడి జనగాం రమేశ్ దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.4,31,000 వచ్చినట్లు దేవదాయ శాఖ పరిశీలకులు డి.అనిల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 16, 2024

మహబూబ్ నగర్: నేటి ముఖ్య వార్తలు!!

image

✔NGKL:మాంసం ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
✔SDNR: సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి సూసైడ్
✔మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం:MP డీకే అరుణ
✔రైతులను ఏరివేసేందుకే మార్గదర్శకాలు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✔తెలంగాణ నుంచి అర్హత సాధించిన ఏకైక టీం MBNR:MDCA
✔ఉమ్మడి పాలమూరులో మోస్తారు వర్షం
✔TCC ఉత్తీర్ణులు ధ్రువపత్రాలు తీసుకోండి: DEOలు
✔భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న మొహర్రం వేడుకలు

News July 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. @ ఎండపల్లి మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ వెల్గటూర్ మండలంలో ఓ ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్. @ ధర్మారం మండలంలో ట్రాక్టర్, బోలెరో డీ.. ఇద్దరి మృతి. @ కోరుట్ల పట్టణంలో ఎరువుల దుకాణాలలో వ్యవసాయ అధికారుల తనిఖీలు. @ బీర్పూర్ మండలంలో కుక్కల దాడిలో బాలుడికి గాయాలు.

News July 16, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి ముఖ్యాంశాలు

image

★ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వర్షం
★ కాగజ్ నగర్: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
★ ముధోల్: విద్యుత్ షాక్ తో గేదెమృతి
★ నిర్మల్: 14 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
★ భైంసా: అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
★ కడెం: క్షణికావేశంలో ఒకరు ఆత్మహత్య
★ చిట్యాల: అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టిన లారీ
★ ADB: జైలునుంచి విడుదలైన బీజేపీ నాయకులు
★ బెజ్జుర్: భారీ కొండ చిలువ ప్రత్యక్షం
★ భైంసా: దొంగ అరెస్ట్

News July 16, 2024

ఖమ్మం: వృద్ధురాలి హత్య

image

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సామ్యతండాకు చెందిన సక్రి(65)ని దుండగులు హత్య చేశారు. స్థానికుల వివరాలిలా.. సక్రి రోజూ పనికి వెళ్తుంటుంది. ఇవాళ ఇంటి నుంచి బయటకు రాలేదు. చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

News July 16, 2024

దుబ్బాక: పల్లె ప్రకృతి వనం వద్ద ఉరేసుకొని వ్యక్తి మృతి

image

కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన దుబ్బాక మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. బొప్పాపూర్ గ్రామానికి చెందిన పరశురాములు మద్యం సేవించి భార్యపిల్లలతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల 13న చిన్న కూతురు మంగతో గొడవపడగా, 14న గ్రామస్థుల ఎదుట తప్పు ఒప్పుకొని మంచిగా ఉంటానని హామీ ఇచ్చాడు. అదే రోజు రాత్రి ఇంట్లోంచి వెళ్లి కనిపించలేదు. ఈ రోజు పల్లె ప్రకృతివనం వద్ద ఉరివేసుకున్నాడు.

News July 16, 2024

ములుగు: జలపాతాలకు వెళ్లే వారిపై పోలీసుల నజర్

image

ములుగు జిల్లాలోని వివిధ జలపాతాలకు వెళ్లే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం మండలాల పోలీసులు నిత్యం వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మద్యం సేవించి జలపాతంలోకి దిగొద్దని హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ విషయాలు గమనించాలని కోరారు.

News July 16, 2024

NGKL: మాంసం ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

మాంసం ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన రాజు (35) మాంసం తెచ్చుకుని తింటుండగా.. గొంతులో ముక్క ఇరుక్కుంది. కుటుంబసభ్యులు నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News July 16, 2024

ADB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అదిలాబాద్ డిఈఓ ప్రణీత పేర్కొన్నారు. జలై 15 వరకు గడువు ఉండగా, ఈ నెల 21 వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలోని ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత ఆన్‌లైన్ పేమెంట్ కాపీతో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News July 16, 2024

సీఎం చదివిన స్కూల్ నూతన భవనం నమూనా ఇదే!

image

వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల నూతన భవనం నమూనాను ఎమ్మెల్యే మేఘారెడ్డి విడుదల చేశారు. సుమారు రూ.160 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భవనంలో పాఠశాలతో పాటు, జూనియర్ కళాశాల, షాపింగ్ కాంప్లెక్స్ నమూనాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎంకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు సమర్పించగా ఆయన సూతప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.