Telangana

News July 16, 2024

సీఎం సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని జిల్లా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రూరల్ వైద్యులను ప్రోత్సాహించేలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.

News July 16, 2024

సంగారెడ్డి: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

image

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని గొడ్డలితో కొడుకు నరికి చంపేసిన ఘటన కంగ్టి మండలం చౌకన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొడ్డే మారుతి (65)ను, ఆయన కొడుకు నరసప్ప (20) గొడ్డలితో నరికి హతమార్చాడు. అయితే తండ్రి కొడుకుల మధ్య డబ్బుల వ్యవహారమే ఈ ఘటనకు కారణమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కఠిన చర్యలు: DMHO భాస్కర్ నాయక్

image

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DMHO భాస్కర్ నాయక్ అన్నారు. అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సరైన కారణం లేకుండా అబార్షన్ చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

News July 16, 2024

వరంగల్: బాధిత కుటుంబానికి కేటీఆర్ రూ.5 లక్షలు

image

వరంగల్ జిల్లాలోని పదహారు చింతల్ తండాలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5 లక్షల సాయంతో పాటు పిల్లలిద్దరీ చదువు బాధ్యత తనదేనని చెప్పారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News July 16, 2024

NZB: బీజేపీ, బీఆర్ఎస్‌ కుమ్మక్కయ్యాయి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో తమకు తెలుసన్నారు.

News July 16, 2024

మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం: డీకే అరుణ

image

రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు మమ అనిపించే విధంగా ఉన్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించారని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.

News July 16, 2024

ADB: పరీక్షకు హాజరైన.. హాజరు కాని ఫలితాలు

image

కాకతీయ యూనివర్సిటీ విధానంపై విద్యార్థులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇటీవల జరిగిన 6వ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారు. కానీ విడుదలైన ఫలితాల్లో వారు పరీక్షకు హాజరు కాలేదని చూపడంతో ఆశ్చర్యపోతున్నారు. PG విద్య కోసం ఇప్పటికే ఎంట్రెన్స్ పరీక్ష కూడా రాశారు. కానీ పరీక్షలకు హాజరు కాకపోవడంతో ఉన్నత విద్య చదివే అవకాశం కోల్పోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 16, 2024

నల్గొండ: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

image

చండూరు మండలం ఇడికూడ పంచాయతీ సెక్రటరీ సైదులు సస్పెండ్ అయ్యారు. గతంలో ఆయన చండూరు మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్న సమయంలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ సైదులును సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

News July 16, 2024

కొత్తగూడెం: పోలీసుల ఎదుట మావోల లొంగుబాటు 

image

చర్ల మండల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహన్ ఎదుట రూ.20 లక్షల రివార్డ్ కలిగిన నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 

News July 16, 2024

స్పీకర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు

image

హైదరాబాద్ అసెంబ్లీ హాల్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మాజీ మంత్రి హరీశ్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం భేటీ అయ్యారు. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలను స్పీకర్‌కు వివరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కేటీఆర్, చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, మాణిక్యరావు ఉన్నారు.