Telangana

News March 21, 2024

చౌటుప్పల్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం గుండ్లబావి స్టేజి వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలిలా.. రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన బొడ్డుపల్లి సాయికుమార్, నవీన్ బైక్ పై వెళ్తుండగా గుండ్లబావి వద్ద గుర్తుతెలియని వాహనం కొట్టింది. ప్రమాదంలో సాయి అక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన నవీన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2024

ASF: నకిలీ PG సర్టిఫికెట్.. లెక్చరర్ డిస్మిస్

image

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న నాగరాజును సర్వీసు నుంచి తొలగించినట్లు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్‌గా విధుల్లో చేరిన నాగరాజు నకిలీ పీజీ సర్టిఫికెట్ సమర్పించినట్లుగా నిర్ధారించి విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 21, 2024

‘PU సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు పెంచాలి’

image

ఈనెల 12న పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజులను ఈనెల 27 వరకు చెల్లించాలని తెలిపింది. కాగా 1, 3, 5వ సెమిస్టర్ల ఇంప్రూవ్మెంట్, రీవాల్యుయేషన్ ఫలితాలు రాకముందే 2, 4, 6వ సెమిస్టర్ల ఫీజు గడువు రావడంతో ఆయా సెమిస్టర్ల డిగ్రీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2, 4 ,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువును పెంచాలని పీయూ యూనివర్సిటీ పరీక్షల అధికారులను కోరుతున్నారు.

News March 21, 2024

మల్కాజిగిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలి: సునీతారెడ్డి

image

మల్కాజిగిరి సిట్టింగ్ పార్లమెంట్‌లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలని జడ్పీ ఛైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఈరోజు ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులకు సూచించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News March 21, 2024

మల్కాజిగిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలి: సునీతారెడ్డి

image

మల్కాజిగిరి సిట్టింగ్ పార్లమెంట్‌లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలని జడ్పీ ఛైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఈరోజు ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులకు సూచించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News March 21, 2024

మెట్పల్లి: పెళ్లి భోజనాల్లో గొడవ.. కేసు నమోదు

image

వివాహ వేడుక భోజనాల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిన్న మధ్యాహ్నం భోజనాల విషయంలో పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారునికి సంబంధించిన బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మొత్తం 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 21, 2024

ఖమ్మం: అధికారులు లంచం అడుగుతున్నారా?

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధికారులు(అన్ని శాఖలు) ఎవరైనా పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ నెంబర్లకు ఫోన్ చేయాలనీ ఆ శాఖ డీఎస్పీ రమేష్ తెలిపారు. డీఎస్పీ నెంబర్-9154388981, ఇన్స్పెక్టర్ నంబర్స్-9154388984, 9154388986, 9154388987, టోల్ ఫ్రీ నెంబర్-1064 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా, ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

News March 21, 2024

త్వరలోనే వరంగల్‌లో క్రికెట్ క్లబ్ ఏర్పాటు: HCA అధ్యక్షుడు

image

వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ ల్యాండ్ మార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో HYD క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జాతీయ హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి జగన్ మోహన్ రావును సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. HYDతో పాటు WGL జిల్లాలోను క్రికెట్‌ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. త్వరలోనే వరంగల్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేస్తానని అన్నారు.

News March 21, 2024

చైనాలో గుండెపోటుతో పాలమూరు వాసి మృతి

image

MBNR జిల్లా రాజాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన జ్ఞానానంద్ చైనాలో గుండెపోటుతో చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాలు.. హైదరాబాదులో నివసిస్తున్న జ్ఞానానంద్.. ఫిబ్రవరి 22న చైనాకు వెళ్ళాడు. మార్చి 17న చైనాలోని భారతీయ స్నేహితుడి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. జ్ఞానానంధ్ గుండెపోటు వచ్చిందని CPR చేసినా ప్రాణాలు దక్కలేదని చెప్పారని వారు పేర్కొన్నారు.

News March 21, 2024

నార్కట్‌పల్లి: తనిఖీలు ముమ్మరం.. రూ.10 లక్షలు సీజ్

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గురువారం నార్కట్‌పల్లిలో చేపట్టిన తనిఖీలో ఓ వ్యక్తి కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న పది లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరూ రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దని, ఒకవేళ తీసుకెళ్తే ఆ డబ్బుకు సంబంధించి ఆధారాలు వెంట తీసుకెళ్లాలని సూచించారు.