India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లాలోని సమస్యాత్మకమైన పలు నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 4గంటలకు ముగిసింది. ఇన్నిరోజులు జోరుగా మోగిన మైకులు మూగబోయాయి. మే 13న పోలింగ్ జరగనుంది.
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సా.6 గంటల నుండి 14న 6 గంటల వరకు జిల్లాలో 144 CrPC సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి పేర్కొన్నారు. జిల్లాలో ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగవద్దని, జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న BRS రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. గద్వాల జిల్లా అయిజలో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. BRS నేతలు కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు దోచుకున్నారని, ప్రభుత్వ ఖజానాకు రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. BRS రాష్ట్రాని దోచుకుంటే, BJP దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టారని విమర్శించారు.
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని ఆయా గ్రామాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి విపి గౌతమ్ అన్నారు. స్లిప్‌లు రాని వారు ఓటు హక్కు రద్దైనట్లు భావించకూడదని, ఓటర్ స్లిప్ సమాచార నిమిత్తమే ఓటర్ స్లిప్ రాని వాళ్ళు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి ఓటు వేయొచ్చని చెప్పారు. 48 గంటల్లో స్టార్ క్యాంపెయినర్ లా వచ్చిన వారు వాళ్ళ ప్రాంతానికి వెళ్లిపోవాలన్నారు. అటు నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న RTC బస్సులో ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. నాగధర్ గ్రామానికి చెందిన వడ్ల అంజయ్య సికింద్రాబాద్ బస్సు ఎక్కగా.. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి శివారులో గుండెపోటు రాగా బస్సు సీటులోనే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రజలు తనకు అండగా నిలవాలన్నారు.
ఐదేళ్ళు అధికార పార్టీ ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూటకపు హామీలిస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ సమస్యల పట్ల అర్వింద్ కు అవగాహన చిత్తశుద్ది లేదన్నారు. అర్వింద్ కవితను ఆదర్శంగా తీసుకుని పనిచేశారని, ఆయన ఎవరికీ అందుబాటులో లేరని,
ప్రజా సమస్యలు గాలికొదిలేశారని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని CP కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్రం తర్వాత నిజామాబాదు పార్లమెంటులో ఓటు లేని బయటి ప్రాంతాల వ్యక్తులెవరూ ఉండకూడదన్నారు. ఈ మేరకు
లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్‌కు నోటీసులిచ్చామన్నారు.
హైదరాబాద్.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఇక్కడ మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి పెంచాలి కానీ ఉన్న కంపెనీలు పోయేలా కాంగ్రెసోళ్లు చేయొద్దని KCR అన్నారు. పలు పరిశ్రమలు HYD నుంచి తరలివెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. KCRను తిట్టడం బంద్ చేసి తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెసోళ్లు దృష్టి సారించాలన్నారు. ప్రజలకు పనులు చేసి చూపించాలన్నారు. కరెంట్ కోతలతో ఇబ్బంది పెట్టొద్దన్నారు.
Sorry, no posts matched your criteria.