Telangana

News March 21, 2024

నన్ను ఎంపీగా గెలిపించండి: వంశీ చంద్ రెడ్డి

image

పాలమూరు బిడ్డగా రాష్ట్రంలోనే తొలి జాబితాలో ఎంపీ టికెట్ దక్కే అవకాశం లభించిందని, తనను గెలిపించే బాధ్యత కూడా ఇదే పాలమూరు బిడ్డలు తీసుకోవాలని CWC ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీ చంద్ రెడ్డి కోరారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. గత పది ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప అధికారులు ప్రజాప్రతినిధులకు ఎవరికీ అధికారం ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరించాలని ఆరోపించారు.

News March 21, 2024

మాజీ సీఎంకి స్వాగతం పలికిన మంత్రి పొన్నం

image

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితోపాటు సహచర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

News March 21, 2024

ఖమ్మం: కీలక నేత పార్టీ మార్పు..?

image

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ మారుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఎంపీ నామాను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు దిల్లీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామా పోటీ చేస్తారని టాక్. ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. అటు నామా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

News March 21, 2024

HYD: BRS మాజీ నేతలకే.. ఆ పార్టీల్లో టికెట్?

image

HYD, ఉమ్మడి RRలోని పార్లమెంట్ స్థానాల్లో BRS మాజీ నేతలకే రెండు జాతీయ పార్టీల్లో టికెట్లు వస్తుండడం గమనార్హం. BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ కన్ఫర్మ్ కాగా సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తారని సమాచారం. ఇక BRSను వీడి BJPలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్‌ అయ్యాయి. దీనిపై మీ కామెంట్?

News March 21, 2024

HYD: BRS మాజీ నేతలకే.. ఆ పార్టీల్లో టికెట్?

image

HYD, ఉమ్మడి RRలోని పార్లమెంట్ స్థానాల్లో BRS మాజీ నేతలకే రెండు జాతీయ పార్టీల్లో టికెట్లు వస్తుండడం గమనార్హం. BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ కన్ఫర్మ్ కాగా సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తారని సమాచారం. ఇక BRSను వీడి BJPలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్‌ అయ్యాయి. దీనిపై మీ కామెంట్?

News March 21, 2024

NGKL: కన్న కొడుకును హత్య చేసిన తల్లి

image

ఓ తల్లి కొడుకుని హత్య చేసిన ఘటన బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకు హరీశ్(11)ను గురువారం ఇంట్లో భర్త లేని సమయంలో రోకలి బండతో కొట్టి చంపేసింది. తర్వాత బుట్టలో చుట్టి, నీటి తొట్టిలో పడేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2024

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆత్రం సుగుణ

image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆత్రం సుగుణ సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జ్ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆమె బరిలో ఉన్నారు.

News March 21, 2024

బీఆర్ఎస్ కు నీళ్లు ఇవ్వమని అడిగే హక్కు లేదు: మంత్రి తుమ్మల

image

బీఆర్ఎస్ నాయకులకు నీళ్లు వదలమని అడిగే హక్కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత వర్షాకాల సీజన్ లో వాళ్లు అధికారంలో ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయలేకపోయారని అలాంటప్పుడు ఈ సీజన్ లో నీళ్లు ఇవ్వమని అడిగే హక్కు వారికి ఎలా ఉంటుందని మంత్రి ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలను పూర్తిగా ఎండబెట్టే పరిస్థితికి తెచ్చారని బీఆర్ఎస్ పై ఆయన మండిపడ్డారు.

News March 21, 2024

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత

image

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత, కడెం మండలానికి చెందిన సిద్ధార్థ నాయక్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం కడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉందని వాపోయారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆయన తెలిపారు. ఓయూ జేఏసీ తరఫున పోటీ చేయనున్నానని ఆయన వెల్లడించారు.

News March 21, 2024

FLASH.. నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

image

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో భాస్కర్ రెడ్డికీ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. 21 మంది పాలకవర్గ సభ్యులకుగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది భాస్కర్ రెడ్డి పై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.