Telangana

News July 16, 2024

ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్య

image

ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి అమ్మమ్మను మనుమడు కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. దురలవాట్లకు బానిసైన అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

రాజన్న సన్నిధిలో రేపటి ప్రత్యేక పూజలు ఇవే!

image

వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. స్వామివారికి, అనుబంధ పరివార దేవతలకు ఉదయం అభిషేక అర్చనలు, శ్రీరుక్మిణి విఠలేశ్వర స్వామివార్లకుకు పంచోపనిషత్ ద్వారా అభిషేకం మహాపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17, 18వ తేదీల్లో అఖండ భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News July 16, 2024

WGL: నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్

image

చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించిన పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన కోల శ్రీను(33) కుటుంబానికి మాజీ మంత్రి KTR అండగా నిలిచారు. BRS సోషల్ మీడియా ఇంచార్జీ వినయ్.. పిల్లలను ఆదుకోవాలని ట్వీట్ చేయగా KTR స్పందించి పిల్లలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వినయ్‌తో మాట్లాడి పూర్తి వివరాలను KTR అడిగి తెలుసుకున్నారు.

News July 16, 2024

పెన్‌పహాడ్: గురుకుల విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఐదవ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన పెన్‌పహాడ్‌ మండలం దోసపాడు గురుకుల పాఠశాలలో జరిగింది. నూతనకల్ మండలం మాచనపల్లికి చెందిన సోమయ్య-నవ్య దంపతుల కూతురు సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది. ఈరోజు ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

మెదక్ జిల్లాను వణికిస్తున్న విషజ్వరాలు !

image

ఉమ్మడి జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌ ఏరియా దవాఖాన, తూప్రాన్‌, రామాయంపేట, కౌడిపల్లి పీహెచ్‌సీల్లో రోగులు బారులుతీరుతున్నారు. జూన్‌లో కౌడిపల్లి పీహెచ్సీలో 148 మంది జ్వరంతో బాధపడుతున్న వారికి చికిత్సలు చేయగా, జూలైలో 57 మంది టైఫాయిడ్‌ బాధితులకు వైద్యం అందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

News July 16, 2024

జూరాల జలాశయానికి పెరిగిన వరద ప్రవహం

image

వర్షాల ప్రభావంతో జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. 2,890 క్యూసెక్కుల వరద చేరుతోంది. మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉందని పీజేపీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 7.721 టీఎంసీల నిల్వ ఉంది. నెట్టెంపాడులో ఓ పంపు ద్వారా నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు, భీమా, జూరాల ఎడమ కాల్వలకు కలిపి మొత్తం 1,806 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అటు అల్మటి ప్రాజెక్టుకు 25,123 క్యూసెక్కుల వరద వస్తోంది.

News July 16, 2024

ADB: కొడుకుపై తల్లి ఫిర్యాదు.. తిరుగివస్తుండగా మృతి

image

ఆదిలాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన విఠాబాయి (90), భర్త దేవ్‌రావు, కూతురు, అల్లుడితో కలిసి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కొడుకు గంగారాం తమను ఇంట్లోనుంచి గెంటేశాడని, సంవత్సరం నుంచి అన్నం పెట్టడంలేదని కలెక్టర్‌తో విన్నవించుకున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. కాగా తిరిగి వస్తుండగా ఆమె ఆటోలోనే చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు.

News July 16, 2024

జడ్చర్ల, MBNR, భూత్పూర్‌కు రింగ్ రోడ్డు: మంత్రి కోమటిరెడ్డి

image

జడ్చర్ల, మహబూబ్‌నగర్, భూత్పూర్ కలుపుతూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో రూ.130 కోట్ల వ్యయంతో చేపట్టే రహదారుల నిర్మాణాలకు మంత్రి ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆర్ అండ్ బి శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నిధులు కేటాయించి రోడ్లను విస్తరిస్తామన్నారు.

News July 16, 2024

శ్రీవారిసేవలో మాజీ మంత్రి కొప్పుల

image

తిరుపతి వేంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను కొప్పులకు అందజేశారు. అనంతరం అక్కడ నుంచి తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News July 16, 2024

మణుగూరు: మూడు నెలల చిన్నారి మృతి

image

మణుగూరు మండలంలోని రాజీవ్ గాంధీనగర్‌లో మూడు నెలల చిన్నారి నిద్రలోనే మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకొంది. ఇస్మాయిల్, నసీమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెను తన వద్దనే ఉంచుకొని తల్లి నిద్రించింది. ఉదయం లేచి చూసేసరికి చిన్నారి శరీరం కమిలి పోయి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.