Telangana

News April 8, 2024

జగిత్యాల జిల్లాలో సదరం శిబిరాల తేదీలు ఇవే

image

జగిత్యాలలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు హాస్పిటల్ ధరూర్‌లో ఏప్రిల్, మే నెలలో సదరం శిబిరాలు నిర్వహించబడునని జిల్లా వైద్య పర్యవేక్షకులు తెలిపారు. ఏప్రిల్ 10, 18, 19, 24, 26, 30, మే 8, 15, 17, 22, 29, 31 తేదీలలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శిబిరాలు నిర్వహించబడునున్నారు. ఏప్రిల్ 23, మే 24 తేదీలలో మాతా శిశు హాస్పిటల్‌లో శిబిరం నిర్వహించబడునన్నారు. ఈనెల 8 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు.

News April 8, 2024

రామయ్య పెళ్లికి ఆహ్వానం

image

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థాన అధికారులు సోమవారం విడుదల చేశారు. కళ్యాణోత్సవానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని పేర్కొన్నారు.

News April 8, 2024

కొండగట్టులో హనుమాన్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఈనెల 22 నుంచి 24 వరకు కొండగట్టులో జరిగే శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు.

News April 8, 2024

MDK: మొర్రి పండ్ల కోసం వెళ్లి యువకుడి మృతి

image

మొర్రి పండ్ల కోసం వెళ్లిన యువకుడు విద్యుదాఘతంతో మృతి చెందిన ఘటన హవేలీ ఘనపురం మండలం శాలిపేట శివారులో సోమవారం జరిగింది. బూరుగుపల్లికి చెందిన బాజా కిషోర్(20) మొర్రి పండ్లు తెంపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ పెద్ద లైన్ చెట్టుకు తగిలి అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా మృతి చెందాడు. కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు.

News April 8, 2024

BRS కంటోన్మెంట్ టికెట్.. ఆ ముగ్గురికి మళ్లీ నిరాశే!

image

BRS కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు లీడర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో TDP నుంచి గెలుపొందిన సాయన్న ఆ తర్వాత BRSలో చేరారు. 2018లో సాయన్నకే KCR టికెట్ ఇచ్చారు.ఆ తర్వాత ఆయన చనిపోవడంతో, 2023 ఎన్నికల్లో సాయన్న బిడ్డ లాస్య నందితకు టికెట్ ఇవ్వగా ఆమె చనిపోయారు. తాజాగా నివేదితకు టికెట్ ఇవ్వనున్నారు.

News April 8, 2024

BRS కంటోన్మెంట్ టికెట్.. ఆ ముగ్గురికి మళ్లీ నిరాశే!

image

BRS కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు లీడర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో TDP నుంచి గెలుపొందిన సాయన్న ఆ తర్వాత BRSలో చేరారు. 2018లో సాయన్నకే KCR టికెట్ ఇచ్చారు.ఆ తర్వాత ఆయన చనిపోవడంతో, 2023 ఎన్నికల్లో సాయన్న బిడ్డ లాస్య నందితకు టికెట్ ఇవ్వగా ఆమె చనిపోయారు. తాజాగా నివేదితకు టికెట్ ఇవ్వనున్నారు.

News April 8, 2024

సూర్యాపేట: బ్రెయిన్ డెడ్.. పదేళ్ల బాలుడి మృతి 

image

తిరుమలగిరి మండలం జేత్యా తండాకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఎర్రం శెట్టి యాదగిరి కుమారుడు అవినీవేశ్ (10) బ్రెయిన్ డెడ్‌తో మృతిచెందాడు. మండల విద్యాధికారి శాంతయ్య, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు మృతి చెందడం బాధాకరమన్నారు.

News April 8, 2024

మినీ ఇండియా పటాన్‌చెరుపైనే అందరి దృష్టి..!

image

మినీ ఇండియాగా పేరుపడిన పటాన్‌చెరు నియోజకవర్గంపై అన్ని పార్టీల దృష్టి సారించాయి. 3 లక్షలపై చిలుకు ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో విభిన్న రకాల ప్రజలు ఉన్నారు. పటాన్ చెరులో ఆధిక్యత వస్తే గెలుపు సులువు అనే ధీమాలో పార్టీలు ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ప్రాంతంలో ఫోకస్ పెట్టాయి. ఎక్కువ ఓట్లు కొల్లగొట్టి తమ గెలుపుకు బాటలు వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

News April 8, 2024

భద్రాచలం: నిత్యకళ్యాణాలు , పవళింపు సేవలు రద్దు

image

భద్రాచలంలో ఉగాది మరుసటి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 9 నుంచి 23 వరకు బేడా మండపంలో జరిగే నిత్యకళ్యాణాలు, దర్బారు సేవలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 2వ తేదీ నుంచి పర్యంతోత్సవం , పవళింపు సేవలు ప్రారంభమవుతాయన్నారు.

News April 8, 2024

HYD: రూ.7,30,400 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

image

HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.7,30,400 నగదు, రూ.11,62,203 విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 8 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. 4 FIRలు నమోదు చేసినట్లు చెప్పారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.