Telangana

News May 11, 2024

KTDM: ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లా గంగలోర్ పీఎస్ పరిధిలోని పీడీయా  అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే మరింత అవకాశం ఉందని తెలిసింది. అలాగే మృతి చెందిన వారిలో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం.

News May 11, 2024

సూర్యాపేటకు జగదీశ్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలి: రఘువీర్

image

సూర్యాపేటకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట అభివృద్ధి దామోదర్ రెడ్డి హయాంలోని జరిగిందన్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి సూర్యాపేట జిల్లాకు నీరు అందించిన ఘనత జానారెడ్డికి దక్కుతుందన్నారు. పదేళ్లలో అటు బిజెపి, ఇటు బిఆర్ఎస్ పార్టీలు చేసింది శూన్యమన్నారు.

News May 11, 2024

KMM: ఇవాల్టితో ప్రచారానికి తెర

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

News May 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
> ఖమ్మం నగరంలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ
> ఎన్నికల నిర్వహణపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
> ఖమ్మం రూరల్ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
> ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల పొంగులేటి పర్యటన
> ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

News May 11, 2024

HYD: యువతుల ఫొటోలు మార్ఫింగ్.. యువకుడి అరెస్ట్

image

యువతుల ఫొటోలను అశ్లీలంగా మార్చుతున్న యువకుడిని HYD మేడిపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సరూర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అర్షద్ (23) ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిల ఫొటోలు సేకరించి, నగ్న చిత్రాలుగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు. ఈ విషయంపై ఇద్దరి యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి అర్షద్‌ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 11, 2024

NZB: నిఘా నీడన లోక్ సభ ఎన్నికలు

image

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్లమెంటు పరిధిలోని 7నియోజకవర్గాల్లో దాదాపు 2507 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1808 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. సీసీ కెమెరాల నిఘా నీడలో భద్రత కల్పిస్తున్నారు. 506 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొనున్నారు.

News May 11, 2024

షాద్‌నగర్‌: పెట్టుబడులు గుజరాత్‌కు తరలించేందుకు BJP కుట్ర :CM

image

HYDకు వచ్చే పెట్టుబడులు గుజరాత్‌కు తరలించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరగాలన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు.

News May 11, 2024

ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గడువు ముగిసిన తర్వాత రాజకీయ అంశాలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపడం నిషేధమన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News May 11, 2024

గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా: కావ్య

image

గత పదేళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా? అని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రశ్నించారు. భీమారంలో నిర్వహించిన రోడ్ షోలో కావ్య పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని కోట్లాది మందిని నిరుద్యోగులుగా మార్చారని మండిపడ్డారు. వరంగల్ ప్రజలు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కావ్య అన్నారు.

News May 11, 2024

మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బుద్ది చెప్పండి: బండి సంజయ్

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్‌ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్‌ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బుద్ది చెప్పండని అన్నారు.