Telangana

News July 16, 2024

కామారెడ్డి: PGT పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో PGT పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో PG, B.Ed పూర్తి చేసిన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈనెల 18న ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.

News July 16, 2024

HYD:‘విడాకులు ఇచ్చినా.. ఆయనే కావాలి’

image

కోర్టు విడాకులు మంజూరు చేశాక.. తిరిగి ఆయనే భర్తగా కావాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించిన ఘటన శంషాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాల్‌దర్వాజకు చెందన సిద్ధార్థ్, కవితల పెళ్లి తర్వాత గొడవలు జరిగాయి. వారిద్దరు కోర్టును ఆశ్రయించగా విడాకులు మంజూరు చేసింది. దీని తర్వాత సిద్ధార్థ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి మళ్లీ ఆయనే కావాలని ఇటీవల పోలీసులను ఆశ్రయించారు ఆ మహిళ.

News July 16, 2024

HYD: ‘విడాకులు ఇచ్చినా.. ఆయనే కావాలి’

image

కోర్టు విడాకులు మంజూరు చేశాక.. తిరిగి ఆయనే భర్తగా కావాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించిన ఘటన శంషాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాల్‌దర్వాజకు చెందన సిద్ధార్థ్, కవితల పెళ్లి తర్వాత గొడవలు జరిగాయి. వారిద్దరు కోర్టును ఆశ్రయించగా విడాకులు మంజూరు చేసింది. దీని తర్వాత సిద్ధార్థ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి మళ్లీ ఆయనే కావాలని ఇటీవల పోలీసులను ఆశ్రయించారు ఆ మహిళ.

News July 16, 2024

కరీంనగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు!

image

KNR వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కానున్నాయి. ఇందుకు ఒకే చోట నాలుగేళ్లు పూర్తైన వారు DPO ఆఫీస్‌లో దరఖాస్తులు అందజేశారు. ఈనెల 11 సా. వరకు ఆప్షన్ల గడువు ముగిసింది. జిల్లాలో 318 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న కార్యదర్శుల 185 మంది ఉన్నారు. ఈనెల 20 వరకు 88 మందికి బదిలీలకు అవకాశం ఉంది. పైరవీలకు తావు లేకుండా స్థానచలనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

News July 16, 2024

మెదక్ పాలిటిక్స్: నాడు ప్రత్యర్థులు.. సహచరులు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎవరూ ఊహించని స్థాయిలో మార్పుచెందాయి. గత అసెంబ్లీ ఎలక్షన్‌లో పటాన్‌చెరు నుంచి పోటీ చేసిన నీలం మధు, ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా MP ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా గెలిచిన సురేశ్ కుమార్ శెట్కార్(INC), BRS నుంచి పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్‌లో చేరికతో నాటి ఈ నలుగురు ప్రత్యర్థులు నేడు సహచరులయ్యారు.

News July 16, 2024

ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం

image

ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఏండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో విడుదలైన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందామని లేఖలో పేర్కొన్నారు. ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతుక కుమార్ ఆపరేషన్‌ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామన్నారు. మావోయిస్టులపై నిషేధ ఆజ్ఞలు విధించడం తగదన్నారు.

News July 16, 2024

యాంటి నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటు: సీపీ

image

ఖమ్మం: డ్రగ్స్​ సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు, సమాచార వ్యవస్థను మరింత భలోపేతం చేస్తున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణపై ఈ బృందాలు నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. డ్రగ్స్, గంజాయి సమాచారంపై 8712659123 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందజేసిన వారి వివరాలకు గోప్యంగా ఉంచుతామన్నారు.

News July 16, 2024

మహబూబ్ నగర్: నేటి ముఖ్య వార్తలు

image

✒జడ్చర్లలో పర్యటించిన రాష్ట్ర మంత్రులు
✒వనపర్తి: వర్షంలో అంగన్వాడి ఉద్యోగుల భారీ ర్యాలీ
✒ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు
✒ప్రజావాణి.. సమస్యలపై అధికారుల దృష్టి
✒దోస్త్ మూడు దశల్లో చేరింది 9,709 మందే
✒MBNR: ఈనెల 18న అప్రెంటిస్ షిప్ మేళా
✒జడ్చర్ల:APSRTC బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు
✒భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లు
✒MBNR,NGKL,GDWLజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

News July 16, 2024

సీఎం రేవంత్‌కు గద్వాల ఎమ్మెల్యే వినతి

image

సీఎం రేవంత్ రెడ్డిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గద్వాలలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి అయ్యే విధంగా నిధులు కేటాయించాలని అన్నారు. పలు అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గట్టు ఎత్తిపోతల పథకం నీటి సామర్థ్యాన్ని పెంచుతూ నిర్మాణానికి నిధులను విడుదల చేయాలని కోరారు.

News July 16, 2024

కామారెడ్డి: ప్రజావాణిలో 127 ఫిర్యాదులు: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 127 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 66 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.