Telangana

News May 10, 2024

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు: సీఎం రేవంత్

image

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేశారు. పదేళ్లు ప్రధానిగా మోదీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదు. ITIR, బయ్యారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలు ఏమయ్యాయి. మోడీ వచ్చారు. రాష్ట్రానికి ఏమిస్తారో చెప్పలేదు. మోడీ అవినీతి గురించి మాట్లాడేటప్పుడు పక్కన ఉన్నది ఎవరో చూడాలి’ అని ఎద్దేవా చేశారు.

News May 10, 2024

BJPకి వేసే ప్రతి ఓటు.. మీ రిజర్వేషన్ల రద్దుపై తీర్పు: సీఎం రేవంత్‌రెడ్డి

image

పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ వస్తేనే పాలమూరుకు రైలు, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా. BJPకి వేసే ప్రతి ఓటు.. మీ రిజర్వేషన్ల రద్దుపై తీర్పు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. మోదీ మళ్లీ గెలిస్తే మనుషుల మధ్య చిచ్చు పెడతాడు. బీజేపీకి ఎవరైనా ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుంది’ అని అన్నారు.

News May 10, 2024

MHBD: కారు, బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ పట్టణంలోని నందిని నగర్ సమీపంలో గూడూరు తహశీల్దార్ కారు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

ALERT: ఆదిలాబాద్ కలెక్టర్ కీలక సూచనలు

image

వచ్చే 48 గంటలు, 24 గంటలు చాలా కీలకమైనవని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
★ ఎలాంటి రాజకీయ ప్రచారం, పాదయాత్రలు జరగకుండా చూడాలి
★ ప్రచార సామాగ్రి సీజ్ చేయాలి
★మద్యం దుకాణాలు మూసివేయాలి
★ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
★ ఐదుగురు కంటే ఎక్కువ గుమిగూడద్దు
★ పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఏర్పాటు
★ పోలింగ్ స్టేషన్ కి ముందు 100 మీటర్లు సున్నం వేయించాలి
★ డబ్బుల పంపకంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి

News May 10, 2024

HYD: అశ్లీల నృత్యాలు.. ఆఫ్టర్ 9 పబ్ సీజ్

image

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8లో ఉన్న ఆఫ్టర్ 9 పబ్‌ని అమీర్‌పేట ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా పబ్ కొనసాగుతోందని దర్యాప్తులో తేలింది. కొద్దిరోజుల కిందట పోలీసులు చేసిన దాడిలో 162 మంది యువతీ యువకులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యాజమాన్యం పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.

News May 10, 2024

సిరిసల్ల: బావిలో పడ్డ వ్యక్తి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గడ్డి రమేష్(42) ఈనెల 8న మద్యం సేవించి ఇంటికి వస్తున్న క్రమంలో వ్యవసాయ బావిలో పడ్డాడు. భార్య స్వప్న వెతకగా ఆయన ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు బావిలో శవమై తేలాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు.

News May 10, 2024

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన హామీ

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ జిల్లా వాసులకు సంచలన హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో SLBC సొరంగం పనులు పూర్తి చేస్తానని నల్గొండ ప్రజలకు హామీ ఇచ్చారు. నల్లొండలో ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకుంటానని తెలిపారు. మీరు ఇచ్చిన విజయాలకు సార్థకత చేకూర్చేందుకు ప్రతి నిమిషం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు.

News May 10, 2024

HYD: అశ్లీల నృత్యాలు.. ఆఫ్టర్ 9 పబ్ సీజ్

image

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8లో ఉన్న ఆఫ్టర్ 9 పబ్‌ని అమీర్‌పేట ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా పబ్ కొనసాగుతోందని దర్యాప్తులో తేలింది. కొద్దిరోజుల కిందట పోలీసులు చేసిన దాడిలో 162 మంది యువతీ యువకులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యాజమాన్యం పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.

News May 10, 2024

మధిర: ఉరివేసుకుని యువతి మృతి..

image

మధిర పట్టణంలోని అన్నపూర్ణ మెస్ పక్కన విజయవాడ నుంచి వచ్చిన ఓ యువతి (22) అద్దెకు నివాసం ఉంటోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ సహకారంతో మధిర టౌన్ ఎస్ఐ సహకారంతో మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

రేపు పటాన్ చెరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

రేపు పటాన్‌‌‌చెరుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పటాన్‌చెరు పట్టణంలో రోడ్ షో నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహాం వద్ద కార్నర్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ రోడ్ షోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.