India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బైక్‌పై ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తయిన రోడ్డు మార్గంలో ఉమ్లింగ్ లా పాస్‌ను చేరుకుని తిరిగొచ్చిన HYD మహిళా రైడర్ హారికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారు. బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే వివేక్‌ను హారిక కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్లింగ్ లా పాస్ (19,024 అడుగుల ఎత్తు)ను చేరుకున్న తెలంగాణ తొలి మహిళగా హారిక నిలిచి, ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం అభినందనీయమన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు సోమవారం GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 అర్జీలు, ఫోన్ ద్వారా మరో 8 విన్నపాలు వచ్చాయని పరిపాలన విభాగం అదనపు కమిషనర్ నళిని పద్మావతి తెలిపారు. ఆరు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి 102 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించారని, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

నాగల్‌గిద్ద మండలంలోని రేఖానాయక్ తండా, చోక్లా తండా, శాంతినగర్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక్కడి టీచర్లు ఇటీవల జరిగిన బదిలీల్లో మరో చోటుకి వెళ్లారు. ఈ పాఠశాలలు దూర ప్రాంతంలో ఉండడంతో ఇక్కడికి రావడానికి టీచర్లు సుముకత చూపట్లేదు. దీంతో పిల్లలకు తమ వెంట పనులకు తీసుకెళ్లగా, మరికొందరు ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి స్కూళ్లు తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ పూర్వ 10 జిల్లాల్లో HYD, RR జిల్లాలు మినహా మిగిలిన 8 జిల్లాల్లో ఏ1 3డే లీగ్ టోర్నీకి ఎంపికైన ఏకైక జట్టు మహబూబ్‌నగర్ అని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. Way2Newsతో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. “తొలి సారిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జట్టు 3డే టోర్నీకి అర్హత సాధించిందని, నేటి నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు మొత్తం 11 మ్యాచ్లు ఆడాల్సి” ఉంటుందన్నారు.
>>ALL THE BEST
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. మహదేవ్‌పూర్ మండలం కాలేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజీలో 41,200 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజ్లో గత రెండు రోజుల నుంచి నిలకడగా వరద కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపు(బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మొహర్రం, తొలి ఏకాదశి పండుగ సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నామన్నారు. తిరిగి గురువారం మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని పేర్కొన్నారు.
మహిళపై <<13630752>>అత్యాచారానికి<<>> పాల్పడిన ఘటనలో అల్వాల్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆటోలో వెళ్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను ముగ్గురు కారులో తిప్పుతూ చిత్రహింస పెట్టారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అల్వాల్ పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఓ యువతి వద్ద రూ.11.21 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ యువతికి ‘కాయిన్ సీఎక్స్’ కంపెనీ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో వీడియోలకు లైక్‌లు కొట్టి పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామని ఉంది. మొదటగా 3 టాస్కులు చేసి పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.11.21 లక్షలు పెట్టుబడి పెట్టింది. విత్ డ్రా కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Sorry, no posts matched your criteria.