Telangana

News May 10, 2024

జూబ్లీహిల్స్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. సూర్యాపేట(D) కోదాడ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన బాలుడు యూసుఫ్‌గూడలో చదువుకుంటున్నాడు. అతడికి సమీప ప్రాంతంలో నివసించే పదో తరగతి బాలిక పరిచయమైంది. మార్చి 26న బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదైంది.

News May 10, 2024

MBNR: కార్మికురాలిపై అత్యాచారం.. వ్యాపారిపై కేసు

image

ఓ కార్మికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. MBNR జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం శంషాబాద్‌కు వచ్చి బతుకుతున్నారు. ఈ క్రమంలోనే అహ్మద్‌నగర్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఖలీల్‌ పరిచయమయ్యాడు. ఈనెల 25న పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆమెను బైక్‌పై వదిలేస్తానని చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేశారు.

News May 10, 2024

తుది దశకు ప్రచారం.. ఓట్ల వేటలో పార్టీలు

image

సార్వత్రిక సమరం 2024 తుదిదశకు చేరుకుంది. రేపటితో ప్రచారం ముగియనుండడంతో ఇంటింటికి తిరుగుతూ ఆఖరి ఓటు కూడా తమకే వేయాలని పార్టీ శ్రేణులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. గ్రామానికి ఇద్దరు చొప్పున బాధ్యులను నియమించి ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే విధంగా ఒక్కో ఓటరుకు సమయం కేటాయిస్తున్నారు.

News May 10, 2024

భువనగిరి కోటపై ఎర్రజెండా ఎగరేస్తారా..?

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు కామ్రేడ్లదే హవా. ఏ ఎన్నికైనా గెలిచి తీరాల్సిందే. 1952లో ఎంపీ సెగ్మెంట్‌లో నల్గొండ నుంచి అధిక మెజార్టీ, 1957, 1962లో వామపక్షాలే గెలిచాయి. మళ్లీ 1991, 96,98, 2004లో కామ్రెడ్లదే విజయం. అంతటి ఘన చరిత్ర కలిగిన కామ్రెడ్లు కొంతకాలంగా మద్దుతుకే పరిమితమయ్యారు. ఈసారి భువనగిరిలో సీపీఎం ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తుండగా ఏమేరకు ఓట్లు సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.

News May 10, 2024

దోమకొండ: విక్రమ్ మృతదేహం వెలికితీత

image

దోమకొండ గ్రామానికి చెందిన విక్రమ్ అనే యువకుడు గురువారం సాయంత్రం దోమకొండ మండల కేంద్రంలోని కుడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం అతని మృతదేహాన్ని దోమకొండ ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

ఆదిలాబాద్ : మీరు ఓటేశారా..? నేడే LAST మరీ..!

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పించిన ఓటింగ్ సదుపాయం నేటితో ముగియనుందని అధికారులు తెలిపారు. ఈనెల 3నుంచి 8వరకు అవకాశం ఇవ్వగా మరో 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ గడువును పొడిగించారు. రెండు రోజులు గడువు పొడిగించడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News May 10, 2024

HYD: భర్త, మరిది వేధింపులతో నవ వధువు సూసైడ్

image

వేధింపులతో పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి జిల్లా అప్పరాలకు చెందిన గాయత్రి(19)కి పెద్దగూడెం వాసి బాలకృష్ణతో మార్చి 13న పెళ్లైంది. వారు ఉపాధి కోసం HYD వచ్చి కర్మాన్‌ఘట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న వీరితో మరిది శ్రీకాంత్ ఉంటున్నాడు. ఇద్దరి వేధింపులతో గాయత్రి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి 3 రోజుల క్రితం HYD తీసుకురాగా.. గురువారం ఇంట్లో ఉరేసుకుంది.

News May 10, 2024

HYD: భర్త, మరిది వేధింపులతో నవ వధువు సూసైడ్

image

వేధింపులతో పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి జిల్లా అప్పరాలకు చెందిన గాయత్రి(19)కి పెద్దగూడెం వాసి బాలకృష్ణతో మార్చి 13న పెళ్లైంది. వారు ఉపాధి కోసం HYD వచ్చి కర్మాన్‌ఘట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న వీరితో మరిది శ్రీకాంత్ ఉంటున్నాడు. ఇద్దరి వేధింపులతో గాయత్రి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి 3 రోజుల క్రితం HYD తీసుకురాగా.. గురువారం ఇంట్లో ఉరేసుకుంది. 

News May 10, 2024

72ఏళ్లు మెదక్‌లో ముగ్గురే మహిళా ఎంపీలు

image

అన్నిరంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు చట్టసభల్లో అతంతగానే రాణిస్తున్నారు. మెదక్ లోక్‌సభ ఏర్పడి 72ఏళ్లు అవుతున్నా ఇక్కడి నుంచి కేవలం ముగ్గురు మహిళలే MPలుగా ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో సంగం లక్ష్మీబాయి(కాంగ్రెస్), 1980లో ఇందిరాగాంధీ, 2009లో విజయశాంతి(BRS) గెలిచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జహీరాబాద్‌ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ లేరు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యే సునీతారెడ్డి ఒక్కరే.

News May 10, 2024

యూపీఎస్సీ ఫలితాల్లో జనగామ విద్యార్థికి 135వ ర్యాంకు

image

యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఫలితాల్లో జనగామ పట్టణానికి చెందిన భరత్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 135వ ర్యాంకు సాధించారు. పదోతరగతి జనగామలో ప్రైవేటు స్కూల్లో, హైదరాబాద్లో ఇంటర్, మద్రాస్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్ వైపు అడుగేసి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు.