India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం, ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ HYD, రాచకొండ పోలీసు కమిషనర్లు గురువారం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పోలింగ్ రోజైన 13న ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
మెదక్ లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మొత్తం 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 343 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా తేల్చారు. గజ్వేల్ పరిధిలో అత్యధికంగా 69 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అతి తక్కువ సిద్దిపేటలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అటు ఓటర్లను ఆకట్టుకునేందుకు మొత్తం 30 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ ఉద్యోగుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి దేశీయంగా కోల్‌కతాకు వెళ్లాల్సిన 3 విమానాలు, వారణాసి, విజయవాడ, గ్వాలియర్, సూరత్, లక్నో, బెంగళూరు, గోవా, కొచ్చిన్, పుణేకు వెళ్లాల్సిన 12 విమానాలు ఇక్కడి నుంచి బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల సామాగ్రి, సిబ్బందిని తరలించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 320 బస్సులు సిద్ధం చేసినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్గొండ డిపో నుండి 49, దేవరకొండ 83 ,మిర్యాలగూడ 29, కోదాడ 41 ,సూర్యాపేట 72 యాదగిరిగుట్ట 46 బస్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ ఉద్యోగుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి దేశీయంగా కోల్‌కతాకు వెళ్లాల్సిన 3 విమానాలు, వారణాసి, విజయవాడ, గ్వాలియర్, సూరత్, లక్నో, బెంగళూరు, గోవా, కొచ్చిన్, పుణేకు వెళ్లాల్సిన 12 విమానాలు ఇక్కడి నుంచి బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
1952లో నల్గొండ నుంచి ఎంపీ అభ్యర్థిగా రావి నారాయణ రెడ్డికి 3,09,162 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థి పీ.భాస్కర్ రావు మీద 2,22,280 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు పొందిన ఎంపీతో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని అప్పట్లో నిర్ణయించారు. దీంతో నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ సాధించిన నారాయణ రెడ్డి పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభించి తొలి అడుగు వేశారు. #MP Elections
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. సొంత జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకునేందుకు సీఎం వ్యూహరచన చేస్తున్నారు. MBNR, NGKL పార్లమెంటు స్థానాలు ఎంతో కీలకం కావడంతో ఆయన ఈ రెండు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ రెండు స్థానాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సత్తా చాటాలని సీఎం భావిస్తున్నారు.
వేధింపులతో పెళ్లైన 2నెలలకే నవవధువు సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. కొత్తకోట మండలం అప్పరాలకు చెందిన గాయత్రి(19)కు పెద్దగూడెం వాసి బాలకృష్ణతో మార్చి 13న పెళ్లైంది. ఉపాధి కోసం HYDకి వచ్చి కర్మన్‌ఘాట్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటున్న వీరితోపాటు మరిది శ్రీకాంత్ ఉంటున్నాడు. ఇద్దరి వేధింపులతో గాయత్రి పుట్టింటికి వెళ్లగా తల్లిదండ్రులు నచ్చజెప్పి 3రోజుల క్రితం తీసుకురాగా.. గురువారం ఇంట్లో ఆమె ఉరేసుకుంది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటులో ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం చేస్తున్నారు.
ఇందిరాగాంధీ గతంలో గెలిచిన మెదక్‌లో ఆమె మనవడు రాహుల్‌గాంధీ నిర్వహించిన జనజాతరకు అపూర్వ స్పందన వచ్చింది. నర్సాపూర్ వేదికగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇందిరా విజయాన్ని పునరావృతం చేసే దిశగా ప్రచారం నిర్వహించారు. BJP, BRS పాలనలో అభివృద్ధి దూరమైందని రేవంత్ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీలో సైనికుడిలా పనిచేస్తానని రాహుల్ చెప్పారు. దీంతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది.
Sorry, no posts matched your criteria.