Telangana

News July 16, 2024

మెతుకు సీమ రైతులకు GOOD NEWS

image

ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతులకు కాంగ్రెస్ తీపికబురు చెప్పింది. ఆగస్టు 15 లోగా రూ. 2లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం ఈమేరకు మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా నుంచి 2023-24లో 1,75,832 మంది రైతులకు రూ.1,299 కోట్ల మేరకు పంట రుణాలు పంపిణీ చేశారు. ఇందులో లక్ష మందికి పైగా రైతులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారు ఉంటారని సమాచారం.

News July 16, 2024

MBNR: 748 మంది అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు

image

తమ సమస్యల సాధనకై సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు MLA క్యాంపు ఆఫీస్ ముందు ధర్నా చేశారు. దీంతో ధర్నాలో పాల్గొన్న ఆయా జిల్లాల్లోని వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 748 మందికి సోమవారం సాయంత్రం జిల్లా సంక్షేమాధికారి జరినా బేగం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24గంటల్లోగా సంజాయిషీ ఇచ్చుకోవాలని, లేనిపక్షంలో శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

News July 16, 2024

కడుపు నొప్పి తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

image

కడుపునొప్పి తాళలేక విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోనకల్ మండల పరిధిలోనే రావినూతలలో జరిగింది. ఎస్సై కడగండ్ల మధుబాబు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయినపల్లి అచ్యుతరావు, నాగేంద్ర దంపతుల పెద్ద కుమార్తె రిషిత (16) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుందన్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి తాళలేక సోమవారం ఇంట్లో పురుగు మందు తాగి మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 16, 2024

ఆదిలాబాద్: భార్యను దారుణంగా చంపిన భర్త.. కారణమిదే.!

image

<<13633463>>భార్యను చంపి <<>>భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బేలలో జరిగిన విషయం తెలిసిందే. సైద్‌పూర్‌కి చెందిన లక్ష్మణ్(32), బోరిగాంకు చెందిన సునీత(28)ను 9ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. సునీతకు అక్రమసంబంధం ఉందని గొడవపడటంతో ఆమె కొన్ని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం పిల్లల టీసీ కోసం గ్రామానికి వచ్చిన ఆమెను లక్ష్మణ్ కత్తితో దారుణంగా గొంతు కోసి చంపినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు.

News July 16, 2024

MBNR: ఏకరూప దుస్తులకు రూ. 1.31 కోట్ల నిధులు విడుదల

image

2024-25 విద్యా సంవత్సరంలో ఏకరూప దుస్తులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2,998 పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులు అందజేసేందుకు కుట్టు కూలీ కోసం రూ. 1 31 కోట్ల నిధులు విడుదల అయ్యాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో జతకు రూ. 50 వంతున స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేయనున్నారు.

News July 16, 2024

నెక్కొండ: బాలుడి మృతి ఘటన… సుమోటోగా స్వీకరణ

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండలో బాలుడి మృతి ఘటన కేసును తెలంగాణ వైద్య మండలి సుమోటోగా స్వీకరించారు. ఈమేరకు టీజీఎంసి రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల మనది పనే బాలునికి కుక్క కరవగా MGMలో 3 ARV ఇంజక్షన్లు వేయగా.. నాలుగోది RMP వద్ద వేయించారు. దీంతో ఐదు నిమిషాలలోపే మృతి చెందగా, విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మండిపడ్డారు.

News July 16, 2024

NZB: విషాదం.. యువజంట సూసైడ్

image

యువజంట సూసైడ్ చేసుకున్న ఘటన నవీపేటలో జరిగింది. పోలీసుల వివరాలు.. పోతంగల్ మం. హెగ్డోలికి చెందిన అనిల్(28), శైలజ(24)కు ఏడాది కిందట పెళ్లైంది. కాగా తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువుల దుష్పప్రచారం తట్టుకోలేక బాసర గోదావరిలో దూకి సూసైడ్ చేసుకొంటున్నామని దంపతులు కోటగిరి SI సందీప్‌కి వీడియో పంపించారు. దీంతో పోలీసులు గాలించగా పకీరాబాద్-మిట్టాపూర్ రైలు పట్టాలపై వారి మృతదేహాలు గుర్తించారు.

News July 16, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైరల్ ఫీవర్లు

image

ఉమ్మడి WGL జిల్లాలో వైరల్ ఫీవర్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. MHBD జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి జులై వరకు 72 డెంగ్యూ, 34 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు. ఈనెలలో డెంగ్యూ సోకినవారిలో నలుగురు పెద్దలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే జ్వరాలు వచ్చిన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి రక్తనమూనాలను సేకరిస్తున్నామని జిల్లా వైద్యాధికారిణి కళావతిబాయి తెలిపారు.

News July 16, 2024

WGL: భారీగా కురుస్తున్న వర్షాల సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్లు

image

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం వరంగల్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఏవైనా ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3434, 91545 25936ను సంప్రదించాలని సూచించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.

News July 16, 2024

HYD: పుట్టింటి నుంచి భార్య రావట్లేదని కూలీ ఆత్మహత్య

image

పుట్టింటికి వెళ్లిన భార్య రావడం లేదని మనస్తాపానికి గురైన కూలీ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. సికింద్రాబాద్ దూద్‌బావి‌కి చెందిన కూలీ గణేష్ (31) భార్య పుట్టింటి నుంచి రావడం లేదని ఆదివారం రాత్రి సీతాఫల్‌మండి స్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.