India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 13న MP ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ SMSలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.SHARE IT
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్ కోల్పోతున్నారు. ZHB లోక్ సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరగుతుంది. 19 మంది బరిలో ఉండగా..స్వతంత్రులుగా 10 మంది పోటీ చేస్తున్నారు. వారి వారి లక్ష్యాలతో బరిలో దిగుతున్న కనీస పోటీ ఇవ్వలేక పోతున్నారు. దీనికి పెరిగిన ప్రచార వ్యయమే ప్రధాన కారణమవుతుంది.
ఖమ్మం జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు, క్యాడర్ కలిగిన పార్టీగా TDPకి చరిత్ర ఉంది. ఆ పార్టీ మద్దతిచ్చిన వారు ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ. గత ఎన్నికల్లో వారు హస్తం పార్టీకి సపోర్ట్‌గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో జిల్లా నాయకత్వం ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. కానీ తెలుగు తమ్ముళ్లు తలో దారి చూసుకోవడంతో టీడీపీ వర్గాలుగా చీలిపోయింది. మరి జిల్లా నాయకత్వం కార్యకర్తలను సమన్వయం చేస్తుందో లేదో చూడాలి!
ఈ నెల 13న MP ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ SMSలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.SHARE IT
ఈ నెల 13న MP ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ SMSలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.SHARE IT
రాజకీయ గురువు చొక్కారావును ఓడించిన జగపతిరావు కొడుకునే వెంటేసుకుని తిరుగుతూ గురువుకే పంగనామాలు పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ అని, తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమని బండి సంజయ్ ఆరోపించారు. తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి పొన్నం అన్నారు. అలాంటి వ్యక్తి వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గు చేటన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు బాధితుల పోరాటంలో తాను పాల్గొని బాధితులకు అండగా నిలిచానన్నారు.
స్వీప్ కార్యాచరణలో భాగంగా ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందిచే బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకొనేల అవగాహన, చైతన్యం కొరకు ఈ ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన అన్నారు.
WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో పిఓ, ఏపీఓలు, పోలింగ్ సిబ్బందిది ముఖ్యపాత్ర అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కులంపై మేము ఎలాంటి విచారణకైనా సిద్ధమని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్య అన్నారు. హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పదేపదే మా కులం ప్రస్తావన తీసుకువచ్చి కొంత మంది నేతలు రాజకీయ లబ్ధిపొందుతున్నారని, జాతీయ స్థాయి కమిషనే కాదు, ఏ కమిటితో విచారణ జరిపినా మేము సిద్ధమే అని అన్నారు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అయిందని కావ్య అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు, ముఖ్య నేతలకు ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ప్రచారానికి వెళ్లి ఓట్లు వేయమని అడుగుతున్న అభ్యర్థులకు ఓటర్లు తెలివిగా సరే అంటూ తలూపుతున్నారు. ప్రచారానికి వెళ్లిన అన్ని పార్టీల వారికి ఇదే విధమైన సమాధానాలు వస్తుండడంతో ఇంతకు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారో తెలియక ఇటు అభ్యర్థులు.. అటు ముఖ్యమైన నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
Sorry, no posts matched your criteria.