Telangana

News March 20, 2024

వరంగల్: బాలుడికి బైక్ ఇచ్చినందుకు తండ్రికి జైలు శిక్ష

image

మైనర్‌కు బైక్ ఇచ్చినందుకు ఓ తండ్రికి జైలు శిక్ష విధించిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే బాలుడు బైక్ నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో వాహనం సీజ్ చేసి కేసు నమోదుచేశారు. కాగా, బాలుడికి బైక్ ఇచ్చినందుకు తండ్రికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

News March 20, 2024

KMM: భర్తకు నిప్పంటించిన భార్య అరెస్ట్ 

image

చెవిదిద్దులు కొనివ్వలేదని భర్తకు భార్య నిప్పంటించిన సంగతి తెలిసిందే. భార్యను ఖమ్మం 1టౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని నిజాంపేటకు చెందిన షేక్.యాకూబ్ పాషాపై ఇటీవల అతని భార్య సమీనా చెవిదిద్దులు కొనివ్వలేదని నిప్పంటించింది. క్షతగాత్రుడి వ్యక్తి తల్లి ఆశ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

News March 20, 2024

GREAT.. KNR: ఇద్దరికి ప్రతిభా, ఐదుగురికి కీర్తి పురస్కారాలు

image

ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన అవార్డులకు ఉమ్మడి KNR జిల్లాకు చెందిన ఐదుగురు కీర్తి, ఇద్దరు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈమేరకు HYDలో ఈనెల 20, 21న కీర్తి పురస్కారాలు, 28న ప్రతిభా పురస్కారాలను అందుకోనున్నారు. అన్నవరం శ్రీనివాస్, గండ్ర లక్ష్మణ్ రావుకు ప్రతిభా పురస్కారం లభించగా.. మధుసూదన్ రెడ్డి, గోపాల్, సేనాధిపతి, శ్రీనివాస రాజు, సంతొశ్ బాబుకు కీర్తి అవార్డులు లభించాయి.

News March 20, 2024

బాన్సువాడ: భార్యను వేధిస్తున్న భర్తపై కేసు నమోదు

image

బాన్సువాడ పట్టణంలోని గృహహింస కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన భూమయ్య(ఆర్మీ ఉద్యోగి) రోజాను 2017లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇటీవల ఉద్యోగం నుంచి వచ్చిన భూమయ్య అనుమానంతో భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. భార్య రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News March 20, 2024

MBNR: తాగునీటి సమస్యల పరిష్కారానికి ఈ నెంబర్ ఫోన్ చేయండి!

image

తాగునీటి(భగీరథ) సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని మహబూబ్‌నగర్ సర్కిల్ ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాల ప్రజలు హెల్ప్‌లైన్ నంబర్ 08542-242024ను సంప్రదించాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. సరఫరాలో అంతరాయం, లోపాలు, లీకేజీల సమస్యలు తెలియజేయొచ్చని తెలిపారు.

News March 20, 2024

రూ.42వేల విలువైన మద్యం సీజ్: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యాన ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల మంగళవారం చేపట్టిన తనిఖీల్లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్ చేసినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం రామన్నపేట వద్ద రూ.19,628, దానవాయిగూడెం వద్ద రూ.18,469, గోపాలపురం వద్ద రూ.4,681 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కస్తాల సత్యనారాయణ ఆధ్వర్యాన పోలీసులు తనిఖీలు చేపట్టారు.

News March 20, 2024

మెదక్: ప్రాణాలు బలిగొన్న గాలివాన

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గాలివాన రెండు ప్రాణాలు బలిగొంది. గజ్వేల్ మండలం <<12886470>>కొల్గూర్‌<<>>కు చెందిన పదోతరగతి విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం జాజితండాలో మాన్‌సింగ్-మంజుల కుమార్తె సంగీత (6) సోమవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన గాలికి ఎగిరిపోయి పక్కనే ఉన్న ఇంటి గోడను ఢీకొంది. తీవ్రగాయాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

News March 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా పోలీసులు తనిఖీలు
∆} భద్రాచలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనకయ్య పర్యటన

News March 20, 2024

తాగునీటి ఇబ్బందులు ఎదురుకావొద్దు : కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన ఎంపీడీఓలు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్షించారు. జలాశయాల్లో నీటిమట్టం పడిపోతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. బోర్ల మరమ్మతు, ఫ్లషింగ్ చేయించడమే కాక ప్రైవేట్ బావులు, బోర్లను లీజ్కు తీసుకోవాలని సూచించారు.

News March 20, 2024

మెడికల్ కాలేజీలో 38 వైద్యుల పోస్టులు భర్తీ

image

ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 38 వైద్యుల పోస్టులు భర్తీ చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజేశ్వరరావు తెలిపారు. ఇందులో 32 మంది మంగళవారం విధుల్లో చేరారని పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 15న జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నియామకాలతో కొంత మేర వైద్యుల కొరత తీరినట్లేనని, ఎన్నికలు ముగిశాక పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామన్నారు.