India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిడుగుపాటుకు 17 గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన పాల్వంచ మండల పరిధి బిక్కు తండా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మున్సిపల్ పరిధి వెంగళరావు కాలనీకి చెందిన వేల్పుల పెద్దిరాజు మేతకు తన గొర్రెలను మండల పరిధి బిక్కు తండా ప్రాంతానికి తీసుకెళ్లాడు. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షానికి తోడు పిడుగు పడడంతో 17 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్రవారం పాలమూరు జిల్లాకు రానున్నారు. బీజేపీ పాలమూరు అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించే బహిరంగ సభకు నరేంద్ర మోదీ రానున్నారు. అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా షాద్ నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.
ప్రమాదవశాత్తు గోదావరిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెంలో జరిగింది. టీడీపీ ఎంపీటీసీ పాయం దేవి కుమారుడు పాయం జితేంద్ర(15) నెల్లిపాక గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుంచి గేదెలను ఇంటికి తోలుకుని వస్తూ ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. బాలుడి తలిదండ్రుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.
హయ్యర్ బ్రాండ్ బాటిళ్లలో చీప్ లిక్కర్ కలుపి అమ్ముతున్న ఓ వైన్స్‌ను గురువారం పోలీసులు సీజ్ చేశారు. నిజామబాద్‌లోని పరమేశ్వరి వైన్స్‌లో స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్ గురువారం సోదాలు నిర్వహించారు. 37 ఫుల్ బాటిళ్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని, వైన్స్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడిలో SHO దిలీప్, SIలు మల్లేశ్, సుష్మిత, సింధు, సిబ్బంది ఉన్నారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ప్రజలు మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. హన్మకొండలో బీసీ సంఘం సమావేశంలో కావ్య మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల బతుకులు చీకటి మయమవుతాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు తెలంగాణకు, గుజరాత్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమని తెలిపారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మాజీ సీఎం కేసీఆర్ ఛలోక్తులు విసిరారు. కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ మాట్లాడే భాష ఏ భాషనో కూడా మనకు అర్థం కాదని అన్నారు. పార్లమెంటులో ఎప్పుడైనా బండి సంజయ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. మళ్లీ అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపడం అవసరమా? అని కరీంనగర్ ప్రజలను ప్రశ్నిస్తున్నామన్నారు.
భర్త చేతిలో భార్య మృతి చెందిన HYD వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. NGKL జిల్లా ఉయ్యాలవాడ చెందిన సతీష్, స్వాతి దంపతులు. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఈనెల 6న భార్య సతీష్‌తో గొడవ పడగా.. స్వాతి గొంతునులిమి చంపి ఫ్యానుకు ఉరేసి, పారిపోయాడు. స్వాతి పేరెంట్స్ ఆస్తి పిల్లల పేరా చేయాలని డిమాండ్ చేశారు. స్వాతి డెడ్ బాడీ ఖననం చేయకుండా ఉంచారు. భర్తను పోలీసులు అరెస్టు చేశారు.
WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో పిఓ, ఏపీఓలు, పోలింగ్ సిబ్బందిది ముఖ్యపాత్ర అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
NLG జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.584 కోట్లు చెల్లించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. కష్టం మిల్లింగ్ రైస్, యాసంగి ధాన్యం కొనుగోలుపై గురువారం తన ఛాంబర్ లో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు గాను 370 దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, వీటి ద్వారా ఇప్పటి వరకు 661 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
‘నీలం మధు మీద పోటీకి KNR జిల్లా నుంచి వెంకట్రాంరెడ్డిని తీసుకొచ్చారు, మెదక్ జిల్లాలో BRS నుంచి పోటీ చేసే మొగోడు దొరకలేదా’ అని CM రేవంత్ రెడ్డి, KCRను ప్రశ్నించారు. నేడు నర్సాపూర్లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ కోసం రైతుల భూములు గుంజుకున్నోడు వెంకట్రాంరెడ్డి అని ఆరోపించారు. దుబ్బాక ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన రఘునందన్‌ను ఎన్నికల్లో ఓడగొట్టి మధును గెలిపించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.