India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంక్షలు విధిస్తున్నట్లు CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. ట్విన్ సిటీస్‌లో 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్బులు, క్లబ్బులు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఈ 48 గంటలు ప్రచారం కూడా చేయొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
SHARE IT
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్నoదున రానున్న 72 గంటలు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం తెలిపారు. ఈనెల11వ తేదీ నుండి ఎన్నికల రోజైన 13వ తేది వరకు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 48 గంటల నిబంధనలు పటిష్టంగా ఉంటాయన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని… సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో నువ్వా.. నేనా..? అనే రీతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, BJP అభ్యర్థి భరత్ ప్రసాద్, BRS అభ్యర్థి RSP ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ మూడు రోజులు కీలకం కానున్నాయి.
ఖమ్మం గ్రామీణ మండలం ధంసలాపురంలో తీవ్ర విషాదం జరిగింది. మున్నేరులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా, మరో బాలుడి కోసం గాలిస్తున్నారు.
ములుగు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 నుంచి 13 వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. జూన్ 4న తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు.
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలకిషన్ అనే వ్యక్తి గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి, ZHB లోక్ సభ స్థానానికి తొలి MLA, MPలుగా ఎన్నికైంది షెట్కార్‌లే కావడం గమనార్హం. 1952లో ప్రస్తుత NKD అసెంబ్లీ సెగ్మెంట్ కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉండేది. అప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అప్పారావు షెట్కార్ MLA అయ్యారు. పునర్విభజన తర్వాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ MPగా గెలిచారు. కాగా వీరిద్దరూ తాతామనవళ్లు కావడం గమనార్హం.
సైబర్ నేరగాళ్ల బారినపడి ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు పోగొట్టుకున్న ఘటన పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరుకు చెందిన ప్రభుత్వ టీచర్ ఈశ్వర్ ఫోన్‌కు ఆన్‌లైన్ ఉద్యోగం పేరిట ఓ మెసేజ్ వచ్చింది. పెట్టుబడి పెట్టి టాస్కులు పూర్తి చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పడంతో దఫదఫాలుగా రూ.3.99,582 పంపి టాస్కులు చేశాడు. తర్వాత మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జిల్లా పరిధిలో ఒకేరోజు గంట వ్యవధిలో CM, PM ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో BJP MP అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా మక్తల్‌లో కాంగ్రెస్ MP అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డికి మద్దతుగా CM రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌కు హాజరుకానున్నారు. దీంతో జన సమీకరణకు నాయకులు ఇబ్బందులు పడుతున్నారు.
తేనెటీగల దాడిలో యువకుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తారక్(22) తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో నేలను దున్నుతున్న క్రమంలో చెట్టు పై ఉన్న తేనెటీగలు ఒకసారిగా తారక్ పై దాడి చేయడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెత్తుకుంటూ పొలంలో వెళుతుండగా బోర్లపడి మృతి చెందాడు. తారక్ అవివాహితుడు గ్రామంలో విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.