India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్షాల ప్రభావంతో జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. 2,890 క్యూసెక్కుల వరద చేరుతోంది. మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉందని పీజేపీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 7.721 టీఎంసీల నిల్వ ఉంది. నెట్టెంపాడులో ఓ పంపు ద్వారా నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు, భీమా, జూరాల ఎడమ కాల్వలకు కలిపి మొత్తం 1,806 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అటు అల్మటి ప్రాజెక్టుకు 25,123 క్యూసెక్కుల వరద వస్తోంది.
ఆదిలాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన విఠాబాయి (90), భర్త దేవ్‌రావు, కూతురు, అల్లుడితో కలిసి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కొడుకు గంగారాం తమను ఇంట్లోనుంచి గెంటేశాడని, సంవత్సరం నుంచి అన్నం పెట్టడంలేదని కలెక్టర్‌తో విన్నవించుకున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. కాగా తిరిగి వస్తుండగా ఆమె ఆటోలోనే చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు.
జడ్చర్ల, మహబూబ్‌నగర్, భూత్పూర్ కలుపుతూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో రూ.130 కోట్ల వ్యయంతో చేపట్టే రహదారుల నిర్మాణాలకు మంత్రి ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆర్ అండ్ బి శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నిధులు కేటాయించి రోడ్లను విస్తరిస్తామన్నారు.
తిరుపతి వేంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను కొప్పులకు అందజేశారు. అనంతరం అక్కడ నుంచి తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మణుగూరు మండలంలోని రాజీవ్ గాంధీనగర్‌లో మూడు నెలల చిన్నారి నిద్రలోనే మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకొంది. ఇస్మాయిల్, నసీమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెను తన వద్దనే ఉంచుకొని తల్లి నిద్రించింది. ఉదయం లేచి చూసేసరికి చిన్నారి శరీరం కమిలి పోయి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.
నల్గొండ జిల్లాలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో అత్యధికంగా CTL మండలంలో 18.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అనుములలో 0.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. SLGలో 15.5, NKPలో 15.1, మర్రిగూడ 6.9, గట్టుప్పల్ 4.5, KTGR 4.3, చింతపల్లి 3.5, CDR 3.3, NLG 2.8, మునుగోడు 2.6, తిప్పర్తి 2.3, గుండ్లపల్లి 2.2, గుర్రంపోడు 1.8 మీ.మీ వర్షం పడింది.
జడ్చర్ల సమీపంలో NH-44పై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 15 మంది ప్రయాణికులు కోలుకుంటున్నారు. బస్సులో 36 మంది ఉండగా ఆరుగురు కర్నూలు, నంద్యాల, మరో 30 మంది అనంతపురం, గుత్తి, HYD తదితర ప్రాంతాల వాళ్లు ఉన్నారు. పలువురిని మెరుగైన చికిత్స కోసం HYDకి తరలించారు. ఎస్పీ జానకి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు అదనపు డ్రైవర్ కదిరప్ప ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐ ఆదిరెడ్డి తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూర్‌లోని సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు, మిగతా నలుగురు నిర్మల్‌కి చెందిన వారిగా గుర్తించారు.
BRS అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు వారి సమస్యలు చెప్పుకోవాలంటే ప్రజావాణికి రావచ్చని దానికి అధికారులను కూడా రప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామని, రెండు డీఎస్సీలను నిర్వహిస్తామన్నారు.
MSC విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన KNR జిల్లా గంగాధర మం.లో జరిగింది. రామడుగు SI సురేందర్ ప్రకారం.. గర్శకుర్తికి చెందిన మాధవి(23) తల్లి లక్ష్మి ఇటీవల పెద్ద కూతురు ఇంటికి వెళ్లడంతో మాధవి ఒంటరిగా ఉంటోంది. ఉదయం పాలు అమ్మే వ్యక్తి వచ్చి పిలిస్తే పలకకపోవడంతో స్థానికులను పిలిచాడు. ఇంట్లోకి వెళ్లిచూడగా ఉరేసుకొని కనిపించింది. దీంతో హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.