India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గత 3 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో HYDలోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బుధవారం ఆస్పత్రికి చేరుకొని MLAను పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. MLA కౌశిక్ రెడ్డి, BRS లీడర్ జాన్సన్, సుధీర్ రెడ్డి సతీమణి కమలారెడ్డి ఉన్నారు.
మిద్యుత్ కమిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌పై ఏదో ఒకటి ఆపాదించాలనే కుట్రకోణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియల కనిపిస్తుందని ఆమె విమర్శించారు. ప్రభుత్వం వెసే కమిషన్లు కక్ష సాధింపుల కోసమేనని అన్నారు. రేవంత్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో నాలుగు నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలన్నారు. సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి … రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు.
నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో గుర్తు తెలియని దొంగలు మంగళవారం అర్ధరాత్రి దాటాక తాళం వేసిన మూడిళ్లలో భారీగా బంగారం, నగదు అపహరించుకుపోయారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, రూ.11 లక్షల నగదు అపహరించినట్లు బాధిత కుటుంబాలు తెలిపారు. కాగా చోరీ ఆనవాళ్లు తెలియకుండా దొంగలు ఇండ్లలో కారంపొడి చల్లి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీలో నీటమునిగి జగదీశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. తొలి ఏకాదశి సందర్భంగా జగదీశ్ పుణ్యస్నానానికి వెళ్లినట్లు తెలుస్తుంది. మృతుడి స్వస్థలం ఘటకేసర్ మండలం కొర్రెములగా గుర్తించారు. ఇంతక ముందే సూర్యాపేట జిల్లాలో<<13645833>> ఈతకు వెళ్లి ముగ్గురు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే.
పర్వతగిరి మండలం దేవిలాల్ తండాలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. తండాకు చెందిన మాన్య, అంబాలిల కుమార్తె ఐశ్వర్య(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెంది పడి ఉండడం చూసిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలిక మృతిపై ఆరా తీస్తున్నారు.
బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని RR చౌరస్తాలో ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్‌పై 4వ టౌన్ పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. రాకేశ్ అనే వ్యక్తికి సంబందించిన రూ.20లక్షల చెక్కులను అజయ్ తన ఖాతాలో వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
బస్సులో రూ.36 లక్షలు చోరీకి గురైన ఘటనపై జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. HYD మోతీనగర్‌కు చెందిన దామోదర్ విద్యుత్ శాఖ ఉద్యోగి. కర్నూలులో ఉంటున్న తన అక్క భాగ్యలక్ష్మికి డబ్బులు అవసరం ఉండగా ఇచ్చేందుకు మంగళవారం ఉదయం బస్సు వెళ్తున్నాడు. జడ్చర్ల వద్ద టిఫిన్ కోసం దిగుతూ చూడగా సీటుపైన పెట్టిన బ్యాగులో రూ.36లక్షలు కనిపించలేదు. దామోదర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఊట్కూరు మండలం పులిమామిడికి చెందిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన బి. హనుమంతు చిన్న కొడుకు శివ(20) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతతో వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు NRPTఆసుపత్రికి తరలించగా పాము కాటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి MBNR ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెంచాడు
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంలో క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వీరు HYD నుంచి సూర్యాపేకు పనిమీద వచ్చారు. రాజు తన కుమార్తెకు ఈత నేర్పడానికి స్నేహితుడితో కలిసి క్వారీ వద్దకు వెళ్లగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తండ్రి రాజు, అతడి స్నేహితుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.