Telangana

News July 17, 2024

NZB: యూనియన్ బ్యాంకు మేనేజర్ పై కేసు

image

బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని RR చౌరస్తాలో ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్‌పై 4వ టౌన్ పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. రాకేశ్ అనే వ్యక్తికి సంబందించిన రూ.20లక్షల చెక్కులను అజయ్ తన ఖాతాలో వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

News July 17, 2024

జడ్చర్ల: బస్సులో రూ.36 లక్షలు చోరీ

image

బస్సులో రూ.36 లక్షలు చోరీకి గురైన ఘటనపై జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. HYD మోతీనగర్‌కు చెందిన దామోదర్ విద్యుత్ శాఖ ఉద్యోగి. కర్నూలులో ఉంటున్న తన అక్క భాగ్యలక్ష్మికి డబ్బులు అవసరం ఉండగా ఇచ్చేందుకు మంగళవారం ఉదయం బస్సు వెళ్తున్నాడు. జడ్చర్ల వద్ద టిఫిన్ కోసం దిగుతూ చూడగా సీటుపైన పెట్టిన బ్యాగులో రూ.36లక్షలు కనిపించలేదు. దామోదర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 17, 2024

ఊట్కూర్: పాముకాటుతో యువకుడి మృతి

image

ఊట్కూరు మండలం పులిమామిడికి చెందిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన బి. హనుమంతు చిన్న కొడుకు శివ(20) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతతో వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు NRPTఆసుపత్రికి తరలించగా పాము కాటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి MBNR ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెంచాడు

News July 17, 2024

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ముగ్గురు మృతి

image

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంలో క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వీరు HYD నుంచి సూర్యాపేకు పనిమీద వచ్చారు. రాజు తన కుమార్తెకు ఈత నేర్పడానికి స్నేహితుడితో కలిసి క్వారీ వద్దకు వెళ్లగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తండ్రి రాజు, అతడి స్నేహితుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News July 17, 2024

ఆదిలాబాద్: డీఎస్సీ పరీక్ష రాయనున్న 29,543 మంది

image

ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29,543 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. నిర్మల్ జిల్లాలో 342 పోస్టులకు 6,035, ADBలో 324 పోస్టులకు 9,569, MNCLలో 288 పోస్టులకు 8,262, ASFలో 341 పోస్టులకు 5,677 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

News July 17, 2024

వలిగొండ: పోలీసులపై దాడి.. నిందితులు అరెస్ట్

image

పోలీసులపై దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన వలిగొండ మండలం అరూర్‌లో జరిగింది. ఎస్సై మహేందర్ వివరాలిలా.. వలిగొండ ఠాణాకు చెందిన పోలీసులు నిరంజన్, శ్రీనివాస్ సోమవారం రాత్రి బ్లూకోట్ విధులు నిర్వహిస్తుండగా.. రోడ్డుపై నిల్చున్న ఓ ఐదుగురిని ఇంటికి వెళ్ళమని చెప్పారు. దీంతో వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News July 17, 2024

వరంగల్: రెండు మెడికల్ కాలేజీలకు 218పోస్టులు మంజూరు

image

వరంగల్ జిల్లా నర్సంపేట, ములుగులో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు 218పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కాలేజీకి 109పోస్టులు కేటాయించారు. ఇందులో 25ప్రొఫెసర్, 28అసోసియేట్ ప్రొఫెసర్, 56 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

News July 17, 2024

నేడు వనపర్తికి బేబీ సినిమా హీరోయిన్

image

నేడు వనపర్తి జిల్లా కేంద్రానికి బేబీ సినిమా హీరోయిన్ కుమారి వైష్ణవి చైతన్య రానున్నారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన ఓ షాపింగ్, జువెలరీ మాల్‌ను వైష్ణవి ప్రారంభించనున్నారు. స్థానిక కొత్తకోట రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేయనున్నారు.

News July 17, 2024

WGL: తొలి ఏకాదశి పర్వదినానికి ప్రత్యేక స్థానం: మంత్రి సురేఖ

image

తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి పండుగ ప్రజలందరి జీవితాలలో శుభాన్ని కలిగించాలని కోరుకున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు.

News July 17, 2024

కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌కి షోకాజ్ నోటీస్

image

బయ్యారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కల్పనాదేవికి రామారావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని 9 ,10 తరగతి విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో ఉన్న కొత్త పాఠ్య పుస్తకాలు ఉండగా, మాజీ సీఎం ఫొటోతో ఉన్న పాఠ్యపుస్తకాలను స్పెషల్ ఆఫీసర్ పంపిణీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్‌కి షోకాజ్ నోటీసు జారీచేశారు.