India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.
భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 14.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా గుండుమల్లో 10.8 మి.మీ, గద్వాల జిల్లా గట్టులో 3.5 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా తుడుకుర్తిలో 0.5 మి.మీ, వనపర్తి జిల్లా రేమోద్దులలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. ఎస్సై లక్ష్మణ్ వివరాల ప్రకారం.. దొంగతుర్తి గ్రామానికి చెందిన రాజ్ కుమార్(20) మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం తాగడం ఆపేయాలని తండ్రి.. కుమారుడిని మందలిస్తూ వస్తున్నాడు. మనస్తాపానికి గురైన రాజ్ కుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. గీసుకొండ మండలం దస్రుతండాకు చెందిన నందు ఐనవోలు స్తూర్బాగాంధీ విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అయితే ఈనెల 9న తండ్రి కిషోర్ పనిచేస్తున్న బొల్లికుంట వాగ్దేవి కాలేజీ హాస్టల్‌కి హోంసిక్ హలీడెస్‌కు వచ్చిన నందు.. నేడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. MGMలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ, ఏపీకి తాగు నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ బోర్డ్ అనుమతించిన నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతం పరిధిలోని కుడి కాల్వకు డ్యాం అధికారులు 5,598 క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేశారు. సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 504.40 అడుగుల నీరు నిల్వ ఉంది. HYD తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీకి 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
DOST ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు తమ గ్రూపు, మీడియంను మార్చుకోవడానికి అవకాశం కల్పించినట్లు ADB జిల్లా దోస్త్ కో- ఆర్డినేటర్ నర్సింగ్‌రావు తెలిపారు. దోస్త్ లాగిన్ లోకి వెళ్లి ఐడీ పిన్ నంబరును ఎంటర్ చేసి తమ గ్రూపు లేదా మీడియంను ఈ నెల 18లోగా మార్చుకోవచ్చన్నారు. గ్రూపు లేదా మీడియం మార్చుకున్న విద్యార్థులకు కొత్త గ్రూపు లేదా మీడియంను 19న కేటాయించనున్నట్లు వెల్లడించారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు జరిగే DSC పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS చట్టం అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని 6 పరీక్ష కేంద్రాలలో జులై 18 తేదీ నుంచి ప్రతి రోజు 163 ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.
నర్సంపేట పట్టణ కేంద్రంలోని గోక రామస్వామి శాంతి వనంలో అరుదైన పుష్పమైన బ్రహ్మ కమలం వికసించింది. ఈ కమలం మొక్కను రామస్వామి తన శాంతి వనంలో మూడేళ్ల క్రితం నాటాడు. అది సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విచ్చుకుంది. మంగళవారం 3 గంటల ప్రాంతంలో మళ్లీ ముడుచుకోవడం ప్రత్యేకత. హిమాలయాల్లో మాత్రమే పెరిగే అరుదైన పుష్పం నగరంలో కూడా పెరగడంతో పాటు పుష్పించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన యువ దంపతులు అనిల్ కుమార్, శైలజ ఆత్మహత్యకు కారకురాలైన మృతురాలి పిన్ని కంకోళ్ల లక్ష్మిని బుధవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. యువ దంపతులు సోమవారం రాత్రి నవీపేట్ శివారులో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడిస్తూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.